అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలంగాణ రాష్ట్ర 7వ మహాసభను జయప్రదం చేయండి

అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలంగాణ రాష్ట్ర 7వ మహాసభను జయప్రదం చేయండి

హైదరాబాద్, ఏప్రిల్ 1, అద్దం న్యూస్ :  ఈ నెల 10, 11 తేదీల్లో హైద‌రాబాద్‌లో జ‌రుగ‌నున్న అరుణోద‌య సాంస్కృతిక సమైక్య తెలంగాణ రాష్ట్ర 7వ మహాసభను జయప్రదం చేయాల‌ని సమైక్య హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుడు కొండల్ కోరారు. ఈ మేర‌కు గురువారం హైద‌రాబాద్ రాంన‌గ‌ర్‌లో అరుణోద‌య రాష్ట్ర మ‌హాస‌భల‌కు సంబంధించిన పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుడు కొండల్ పాల్గొని మాట్లాడుతూ… దోపిడీ రాజ్యం పై ఎక్కుపెట్టిన గలమై, శ్రామిక వర్గాల వెన్నుతట్టే బలమై ఉదయించిన స్వర ప్రభాతమే అరుణోదయ సాంస్కృతిక సమైక్య అని అన్నారు. తెలంగాణ రైతాంగ‌ సాయుధ పోరాటంలో గర్జించిన బండి యాదగిరి వారసత్వన్ని ఒడిసి పట్టుకున్నదని, శ్రీకాకుళం జమిడికా మోత పాణిగ్రహి పాటల స్పూర్తితో, గోదావరిలోయ ప్రతిఘటన ప్రేరణతో అరుణోదయ 1974 లో ఆవిర్భంవించిందన్నారు. తెలంగాణలో జరిగిన సారా, కరువు, డ్రగ్స్, గంజాయి, వరకట్నం వేధింపులు, మూఢ నమ్మకాల పై పాటలతో ఉద్యమం చేసి ప్రజలని చైతన్యo చేసిందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాటతో ఆంధ్ర పాలకుల దోపిడీని, మోసాన్ని కళా రూపాలతో తూట లాంటి పాటతో ప్రజలను ఉద్యమం వైపు నడిపించిందన్నారు.

తెలంగాణ ధూం ధాంతో ఆంధ్ర పాలకులను దుమ్ము లేపింది అని, గిరిజన, దళిత, ముస్లిం, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాలకులను పాటల గళంతో ప్రశ్నించిందన్నారు. ఈ క్రమంలో అనేక మంది కళాకారులు తమ ప్రాణాలు కోల్పోయారన్నారు. కానూరి వెంకటేశ్వర్లు, రామారావు, పల్స బిక్షం, ఏనుగుల వెంకన్న, కోడి శ్రీ రాములు, సుబ్బారావు లాంటి అనేక మంది అమర కళాకారులను యాది చేసుకొని గతాన్ని సమీక్షా చేసుకొని, భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకొనుటకు తెలంగాణ రాష్ట్ర 7వ మహాసభలను హైదరాబాద్‌లో జ‌రుపుకుంటున్నామ‌న్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సంస్కృతిక సమైక్య హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోలా స్వప్న, కొండల్, అరుణోదయ జిల్లా నాయకులు శ్రీను, చందు, నరేష్, తిరుపతి, ఆనంద్, అంజి, పరుశరామ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page