బిఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌ను విజ‌య‌వంతం చేయండి – బిఆర్ఎస్ శ్రేణుల‌కు ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపు

 

బిఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌ను విజ‌య‌వంతం చేయండి

♦ బిఆర్ఎస్ శ్రేణుల‌కు ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపు

స‌మావేశానికి హాజ‌రైన బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

హైదరాబాద్, అద్దం న్యూస్ :   ఈ నెల 27వ తేదీన వ‌రంగ‌ల్ ఎల్క‌తుర్తిలో నిర్వ‌హించ‌నున్న బిఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఆ పార్టీ శ్రేణుల‌కు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్‌లోని ఆర్య‌వైశ్య హాస్ట‌ల్ సెమినార్ హాల్‌లో బిఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భకు భారీగా కార్య‌క‌ర్త‌ల‌ను త‌రలించేందుకు స‌న్నాహ‌క స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీ 25వ సంవ‌త్స‌రాల సంద‌ర్భంగా ర‌జ‌తోత్స‌వ స‌భ‌ను చ‌రిత్ర‌లో నిలిచిపోయే విధంగా 10 ల‌క్ష‌ల మందితో స‌భ‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. తెలంగాణ భ‌విష్య‌త్తును ఉజ్వ‌లంగా మార్చాల‌నేది కెసిఆర్ సంక‌ల్ప‌మ‌న్నారు. ఈ దిశ‌గా వ‌రంగ‌ల్ స‌భా వేదిక నుంచి కెసిఆర్ విశ్వాసం క‌ల్పిస్తార‌న్నారు. 25వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతున్న గులాబి జెండా… మ‌రో 50 ఏళ్ల పాటు కూడా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటుంద‌న్నారు. వ‌చ్చే రెండు, మూడు ద‌శాబ్దాల పాటు కేంద్రంలో సంకీర్ణ ప్ర‌భుత్వాలే ఉంటాయ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ మ‌న గ‌ళం, బ‌లం, ద‌ళం, గులాబి దండై క‌ద‌లాల‌ని అన్నారు. ఎన్నెన్నో అవ‌మానాలు, అనుమానాలు, ఎదురు దెబ్బ‌లు ఎదుర్కొని కెసిఆర్ నాయ‌క‌త్వంలో రెండు సార్లు తెలంగాణ‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి ప‌థ‌కాల్లో దేశానికే మార్గ‌ద‌ర్శ‌కమైంద‌న్నారు. మొక్క‌వోని దైర్యంతో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను పూర్తి స్థాయిలో నిజం చేసిన గొప్ప నాయ‌కుడు కెసిఆర్ అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ‌కు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వేలాదిగా త‌ర‌లివెళ్లాల‌ని, ఆ దిశ‌గా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న నాయ‌కుడు ముఠా జైసింహా, బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్, గాంధీన‌గ‌ర్, క‌వాడిగూడ‌, రాంన‌గ‌ర్ డివిజ‌న్ల అధ్య‌క్షులు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి, రాకేష్‌, శ్యామ్ యాద‌వ్‌, శంక‌ర్ ముదిరాజ్‌, మీడియా ఇన్చార్జ్ ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఆకుల అరుణ్‌, శ్రీకాంత్‌, సాయికృష్ణ‌, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఎర్రం శ్రీనివాస్ గుప్త‌, మ‌హ్మ‌ద్ జ‌హంగీర్, కొండా స‌హ‌దేవ్‌, ముఠా న‌రేష్‌, రెబ్బ రామారావు, శోభ‌, స్ర‌వంతి, మాధ‌వి, జ‌యేష్ ప‌టేల్‌, ముదిగొండ ముర‌ళీ, వెల్లంకి ఇంధ్ర‌సేనారెడ్డి, మేడి సత్య‌నారాయ‌ణ‌, జావెద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ అలీ, యూనుస్‌, జ‌మాల్‌, దీన్‌ద‌యాల్‌రెడ్డి, ప్రేమ్‌, చింటు, గ‌డ్డ‌మీది శ్రీనివాస్‌, అబ్బు, శంక‌ర్ గౌడ్‌, జ‌బ్బార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా త‌న‌కు స‌మావేశంలో మాట్లాడే హ‌క్కు లేదా :
  ♦ ముషీరాబాద్ డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆకుల అరుణ్ అసంతృప్తి

ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఆర్య‌వైశ్య హాస్ట‌ల్ సెమినార్ హాల్‌లో శుక్ర‌వారం జ‌రిగిన బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో త‌న‌ను మాట్లాడించ‌క‌పోవ‌డం ప‌ట్ల‌ ఆ పార్టీ ముషీరాబాద్ డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆకుల అరుణ్ అసంతృప్తిని వ్య‌క్త‌ప‌రిచారు. తాను డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయిన‌ప్ప‌టికి త‌న‌ను కాద‌ని పార్టీలో ఏ ప‌ద‌వి లేని వారికి స‌మావేశంలో మాట్లాడించడం ఏంట‌ని ఆయ‌న అద్దం న్యూస్ ప్ర‌తినిధితో వాపోయారు. ఇలాంటి స‌మావేశాలు జ‌రిగిన ప్ర‌తిసారి పార్టీలో ఏ ప‌ద‌వి లేని వారికి ప్రాముఖ్య‌త ఇస్తున్నార‌ని, బాధ్య‌త గ‌ల డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న త‌న‌కు ప్ర‌తిసారి అవ‌మాన‌మే జ‌రుగుతుంద‌ని అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page