...

ఈ నెల‌ 12న నిర్వ‌హించ‌నున్న‌ భారీ ర్యాలీ, సభను విజ‌య‌వంతం చేయండి – బీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాద‌వ్‌ పిలుపు

ఈ నెల‌ 12న నిర్వ‌హించ‌నున్న‌ భారీ ర్యాలీ, సభను విజ‌య‌వంతం చేయండి
» బీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాద‌వ్‌ పిలుపు

హైదరాబాద్, ఫిబ్ర‌వ‌రి 9, అద్దం న్యూస్ :    కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్‌తో పాటు కార్మిక హక్కులను బలహీనపరుస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా ఈ నెల 12వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ భారీ ర్యాలీ, స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని బీఆర్‌ఎస్‌కేవీ ( భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం ) రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలోని బీఆర్‌ఎస్‌కేవీ కార్యాలయంలో స‌మ్మెకు సంబంధించిన పోస్ట‌ర్‌ను రాంబాబు యాద‌వ్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ… నాలుగు లేబర్ కోడ్స్‌ ద్వారా మినిమం జీతం, పని గంటలు, యూనియన్ హక్కులు, ఉపాధి భద్రత, సామాజిక రక్షణ వంటి కీలక అంశాలు బలహీనపడుతున్నాయన్నారు.

        కార్మికుల హక్కుల పరిరక్షణ కోసమే ఈ నెల 12వ తేదీన‌ సమ్మె, ఐక్య పోరాటంతోనే మన హక్కులు కాపాడుకోవాలి” అని స్పష్టం చేశారు. ఈ నెల 12న బాగ్‌లింగంప‌ల్లి నుంచి బస్ భవన్ మీదుగా ఇందిరాపార్క్ వరకు భారీ ర్యాలీ, అనంతరం ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్ వద్ద సభ జరుగుతుందని తెలిపారు. కార్మికులు, కార్మిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీ, సభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌కేవీ హైదరాబాద్ ఇంచార్జ్ టివి.లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి మహేష్ దేశపాక్, సిహెచ్‌.సాయి కుమార్, కి.మారుతీ, ఆకుల శ్రీనివాస్, కిరణ్, పి.నిరంజన్, ఎన్.రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.