స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ల పై ఆగస్టు 3 న జరుగనున్న రాష్ట్ర స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి
– రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య

హైదరాబాద్, జులై 20, అద్దం న్యూస్ : స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ల ఆమలు, కేంద్ర ప్రభుత్వం బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించిన అంశాలపై భవిష్యత్తు కార్యాచరణ చర్చించడానికి ఆగస్టు 3 న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం జరపాలని నిర్ణయించడం జరిగిందని, ఈ సమావేశానికి పెద్ద ఎత్తున బిసిలు హాజరై విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ విద్యానగర్ బిసి భవన్‌లో జరిగిన సమావేశంలో ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అమలుకు తీసుకోవలసిన కార్యచరణ రూపొందించాలి. ఈ సమావేశంలో జిల్లాలో జరిగే బీసి గర్జన సన్నాహక సభల గురించి చర్చించి జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో ఆర్.క్రిష్ణయ్య మాట్లాడుతూ… 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నామని, ప్రకారం కుడా బీసీలకు వ్యతిరేకంగా కోర్టులకు పోరని ఆశిస్తున్నామన్నారు. ఎందుకంటే రిజర్వేషన్లు పెంచడానికి న్యాయపరమైన – చట్టపరమైన రాజ్యాంగపరమైన అవరోధాలు ఏమీ లేవు కేసు బలంగా ఉందన్నారు. రిజర్వేషన్లు పెంచడానికి కులాల వారీగా లెక్కలు తీశారని, అసెంబ్లీలో చట్టం చేశారని, జీవో తీయకుండా కోర్టు కొట్టి వేస్తుందని ఊహాగానాలతో పెండింగ్‌లో పెట్టారన్నారు. స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది 73, 74 వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డి 6 టి 6 ప్రకారం స్థానిక సంస్థలోని బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చిందని తెలిపారు. జీవో తీసి వెంటనే ఎన్నికలు జరపవచ్చు ఏమైనా న్యాయమైన సమస్యలు భావిస్తే సుప్రీంకోర్టుకు ఎవరైనా వెళ్లిన బీసీలు, కేసులు గెలిచే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు అగ్ర కులాలకు 10 శాత్తం రిజర్వేషన్లు పెట్టినప్పుడు కేసులో 50 శాతం సీలింగ్ ఎత్తివేసిందన్నారు. ఇప్పుడు అన్ని కోణాల్లో చూస్తే కేసు గెలిచే అవకాశం ఉందన్నారు. చట్ట ప్రకారమైన న్యాయప్రకారము రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు కావున సుప్రీంకోర్టులో కేసు గెలుస్తుందన్నారు. 75 కోట్లకు పైగా ఉన్న బీసీ వర్గాల చిరకాల డిమాండ్‌ను కేంద్రం గౌరవించినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆర్.క్రిష్ణయ్య ధన్యవాదాలు తెలిపారు. కుల గణన తర్వాత బీసీలకు చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు పెంపు వంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారని క్రిష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో బిసి బిల్లు పెట్టి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలన్నారు.
కేంద్రంలో బిసిలకు ప్రతేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి 2 లక్షల కోట్లతో ప్రతేక అభివృద్ధి పథకం ప్రకటించాలన్నారు. బిసిల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 25 నుంచి 50 శాతం పెంచాలని, బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలన్నారు. బిసిల విద్య- ఉద్యోగ రిజర్వేషన్లు పై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలన్నారు. బిసిలకు పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా ఇవ్వాలన్నారు. హై కోర్టు – సుప్రీంకోర్టు జడ్జిల నియమాకంలో ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బిసిలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలన్నారు. గత 30 సంవత్సరాల కాలంలో 160 సార్లు ఢిల్లీలో, వందల సార్లు హైదరాబాద్‌లో ఉద్యమాలు, సభలు పెట్టమన్నామని క్రిష్ణయ్య తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా, మండల, రాష్ట్రస్థాయి ముఖ్య నాయకులు హాజరుకావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమావేశంలో వివిధ బీసీ సంఘాల నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, జిల్లపల్లి అంజి, సతీష్, సుధాకర్, రాజేందర్, మోది రాందేవ్, పృధ్విరాజ్, స్వామి గౌడ్, సతయ్య, బాలాస్వామి, లింగయ్య యాదవ్, ఆశిష్ గౌడ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply