Friday, September 18, 2026
HomeGREATER HYDERABADనిరుద్యోగ మహా ధర్నాను జయప్రదం చెయ్యండి

నిరుద్యోగ మహా ధర్నాను జయప్రదం చెయ్యండి

నేటి నిరుద్యోగ మహా ధర్నాను జయప్రదం చెయ్యండి
– సిపిఎం ముషీరాబాద్ జోన్ కార్యదర్శి వర్గ సభ్యుడు టి.మహేందర్

హైద‌రాబాద్‌, జూలై 14, ( అద్దం న్యూస్ ) :        ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నేడు ( జూలై 15 )వ తేదీన‌ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జ‌రుగ‌నున్న‌ మహాధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం ముషీరాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో చిక్కడపల్లి లైబ్రరీ ఆవ‌ర‌ణ‌లో మంగ‌ళ‌వారం కరపత్రాలు పంచి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం ముషీరాబాద్ జోన్ కార్యదర్శి వర్గ సభ్యులు టి.మహేందర్ మాట్లాడుతూ… తెలంగాణలో ఎన్నో ఆశలు.. యువత త్యాగాలు… నిరుద్యోగుల బలిదానాల‌ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 12 సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం… నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను విస్మ‌రించింద‌న్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా ఇచ్చిన నోటిఫికేషన్ కూడా పేపర్ లీకేజీలు… పరీక్ష వాయిదాలు… కోర్టు వివాదాలు సృష్టించేలా ఉండటంతో నిరుద్యోగుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై యూత్ డిక్లరేషన్ ప్రకటించి పరిష్కారం చెయ్యకుండా మోసం చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లక్షల్లో కొలువులు ఖాళీగా ఉన్నాయని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీతో 2014లో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు గడుస్తున్నప్పటికీ హామీలు నెరవేర్చట్లేదని విమ‌ర్శించారు. ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తే యువతకు సమాధానం చెప్పాల్సిన పాలకులు పకోడీలు.. బజ్జీలు వేయడం కూడా ఉద్యోగాలు అంటూ వ్యాఖ్యలు చేయటం అత్యంత బాధ్యత రహితమైన వైఖరని అన్నారు. దేశంలోని నిరుద్యోగ యువతపై బాధ్యతరహితంగా మాట్లాడటం ఇదేనా మీ దేశభక్తి అని ఎద్దవా చేశారు. ఈ కార్యక్రంలో నాయకులు. సి.మల్లయ్య, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page