క్యాదశి ప్రభాకర్‌కు డాక్టర్.బిఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు–2026
హైదరాబాద్, జూలై 14, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు క్యాదశి ప్రభాకర్‌కు డాక్టర్.బిఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు–2026 దక్కింది. జై తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పాముల రమణ అధ్యక్షతన జన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నంది అవార్డులు, జాతీయ డాక్టర్.బిఆర్.అంబేద్కర్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మంగళారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు క్యాదశి ప్రభాకర్‌కు డాక్టర్.బిఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు–2026 ను అందచేశారు. ఈ సందర్భంగా క్యాదశి ప్రభాకర్ మాట్లాడుతూ… ప్రజా సమస్యలతో పాటు సామాజిక ఉద్యమాలు చేసినందుకు, దళితుల పై జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినందుకు ఈ అవార్డును ఇచ్చారన్నారు. చాలా ప్రాంతాల్లో దళితులను ఆలయాల్లోకి రానివ్వడంలేదన్నారు. వాటి పై కూడా పోరాటం చేశామన్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవంలో గజ్జెల ఆనంద రావు, కళ్లేపెళ్లి శంకర్, తప్పట్ల అంజయ్య, మానాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply