Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadమనస్థాపంతో భవనం పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య 

మనస్థాపంతో భవనం పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య 

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అద్దం న్యూస్ : భర్త, అత్తింటివారు వేధిస్తున్నారనే మనస్థాపంతో భవనం పై నుండి  వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ రాంబాబు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం భోల‌క్‌పూర్ కు చెందిన మల్లేశ్, పుష్పలత దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె సౌజన్య (26)ను నాలుగు నెలల క్రితం మూసాపేటకు చెందిన శబరీష్ కు ఇచ్చి వివాహం జరిపించారు. ఇదిలా ఉండగా సౌజన్య గుండెకు రంధ్రం ఉందనే విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారంటూ పదిహేను రోజులుగా శబరీష్, అత్తింటి వారు ఆమెను వేధించసాగారు. విషయం తెలుసుకున్న సౌజన్య తల్లిదండ్రులు ఆమెను ఈనెల 26 వ తేదీన భోల‌క్‌పూర్ లోని తమ ఇంటికి తీసుకొచ్చారు. తన ఆరోగ్యంపై భర్త, అత్తింటి వారు గత కొన్ని రోజులుగా వేధిస్తుండడంతో తీవ్ర మనస్థాపానికి చెందిన సౌజన్య గురువారం రాత్రి భోల‌క్‌పూర్ లోని తమ భవనం పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page