అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థుల జీవితాల్లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. అమెరికాలోని బర్మింగ్‌హామ్ ప్రాంతంలో తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
అలబామా యూనివర్సిటీ విద్యార్థులే..
విషాదానికి గురైన విద్యార్థులంతా అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లు సమాచారం. బర్మింగ్‌హామ్‌లోని ఒకే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో సుమారు 10 మంది తెలుగు విద్యార్థులు కలిసి నివసిస్తున్నారు. హఠాత్తుగా చెలరేగిన మంటలు అపార్ట్‌మెంట్‌లో మంటలు ఆకస్మికంగా చెలరేగడంతో, లోపల ఉన్న విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మంటలతో పాటు దట్టమైన పొగ రావడంతో విద్యార్థులు ఊపిరి తీసుకోలేక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోపల చిక్కుకున్న కొందరు విద్యార్థులను రక్షించి, వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply