సాయి ఈశ్వర్ చారికి నివాళులర్పించిన ప్రఫుల్ రాంరెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 5, అద్దం న్యూస్ : బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్ చారి భౌతిక కాయానికి తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ( టియు జేఏసి ) అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయి ఈశ్వర్ చారి భార్య, తల్లి, పిల్లలను ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ… సాయి ఈశ్వరాచారి ని బతికించుకోలేకపోయాం .. ఇది చాలా బాధాకరమైన విషయం అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనే అనేక మందిని కోల్పోయామని, బీసీ రిజర్వేషన్లను బరిగీసి కొట్లాడి సాధించుకుందామన్నారు. ప్రాణాలు ఇవ్వటం మాత్రం సరికాదన్నారు. నివాళులర్పించిన వారిలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాద్, మహేష్, సిద్దేశ్వర్, సుధాకర్, ఒగిరాల సుజి, ప్రభాకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ![]()

![]()












Leave a Reply