హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్ : కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శిగా ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎండి.రషీదుద్దీన్ నియమితులయ్యారు. ఈ మేరకు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. గతంలో ఎండి.రషీదుద్దీన్ ముషీరాబాద్ నియోజకవర్గం మైనారిటీ విభాగం చైర్మన్‌గా పని చేశారు. ఈ సందర్భంగా ఎండి.రషీదుద్దీన్ మాట్లాడుతూ… తన పై నమ్మకంతో తనను సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శిగా నియమించినందుకు టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సి బి.మహేష్ కుమార్ గౌడ్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్, సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడు దీపక్ జాన్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్ యాదవ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.![]()

![]()
కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శిగా ఎండి.రషీదుద్దీన్
RELATED ARTICLES

