Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADమంచినీటి సరఫరా, సివరేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు

మంచినీటి సరఫరా, సివరేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు

📰 Generate e-Paper Clip

మంచినీటి సరఫరా, సివరేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు
అధికారులకు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆదేశాలు

సికింద్రాబాద్, ఆగ‌స్టు 26, ( అద్దం న్యూస్ ) :   సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మంచినీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు జరపాలని, సివరేజీ ఇబ్బందులను పూర్తిగా నివారించాలని సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుళ్ళ పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. జలమండలి చీఫ్ జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ నేతృత్వంలోని అధికారులతో పద్మారావు గౌడ్ బుధవారం మోండా మార్కెట్‌లోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో ఇబ్బందులు, డ్రైనేజీ లైన్లు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితులను అధికారులతో చర్చించారు. ఫిర్యాదుల పై వెనవెంటనే స్పందిచాలనీ అధికారులను ఆదేశించారు. మధురానగర్ కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని, స్థానికుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని పద్మారావు గౌడ్ ఆదేశించారు. వివిధ అంశాల పై తాము తక్షణమే స్పందిస్తున్నామని చీఫ్ జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వాట‌ర్ వ‌ర్క్స్‌ మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page