హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిని హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం జరిగింది. గ్రంథాలయ ఉద్యోగులు వెంకటేశ్వర్ రెడ్డి, సుఖేష్ కుమార్, వెంకటేష్ యాదవ్, జానకిరామ్, నరేందర్, మహేష్, రాజేష్ తదితరులు రక్త దానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిఎన్‌జివో సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్, కార్యదర్శి శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం అసోసియేటెడ్ అధ్యక్షుడు బొల్లం మహేందర్, కార్యదర్శి వరప్రసాద్, జాయింట్ సెక్రెటరీ హరిబాబు, కార్యవర్గ సభ్యులు జంగారెడ్డి, వెంకటేష్, ఈఎన్‌టి రాజు ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు, ఎంఎన్‌యు క్యాన్సర్ హాస్పిటల్‌కు, ఉస్మానియా హాస్పిటల్‌కు అందచేస్తామని నిర్వాహకులు తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply