మిలాద్ ఉన్ నబి, గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
– ఈస్ట్ జోన్ డిసిపి డాక్టర్.బి.బాలస్వామి


హైదరాబాద్, ఆగస్టు 19, అద్దం న్యూస్ : మిలాద్ ఉన్ నబి, గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఈస్ట్ జోన్ డిసిపి డాక్టర్.బి.బాలస్వామి అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ – ఈస్ట్ జోన్ సమన్వయ సమావేశం మంగళవారం ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్ లలితానగర్ కమ్యూనిటీహాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి మాట్లాడుతూ… రాబోయే శ్రీ గణేశ్ చతుర్థి, ఈద్ మిలాద్-ఉన్-నబీ ఉత్సవాల సందర్భంగా చట్టం, శాంతి భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు భద్రతా చర్యలను చేపట్టామని తెలిపారు. మండపాల నిర్వాహకులు పోలీసుల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి, రహదారులను ఆపకూడదని, ప్రజలకు సులభంగా రాకపోకలు ఉండేలా చూడాలని సూచించారు. శుభ్రత, పారిశుద్ధ్యం, జీఎచ్ఎంసీ తగిన పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలని, మండపాలు, ఊరేగింపుల మార్గాల్లో చెత్తను సమయానికి తొలగించాలన్నారు. విద్యుత్, వైరింగ్ భద్రత, సరైన లైటింగ్ ఉండాలని, వదులైన వైరింగ్ లేకుండా చూడాలన్నారు. షార్ట్ సర్క్యూట్లను నివారించే చర్యలు చేపట్టాలన్నారు. ఈస్ట్ జోన్ పీస్ కమిటీ చురుకైన భాగస్వామ్యాన్ని అభినందిస్తూ, ఉత్సవాలు సాఫీగా, సురక్షితంగా, శాంతియుతంగా జరిగేలా పోలీసులు అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. అత్యవసర సేవలు, అగ్నిమాపక శాఖ, వైద్య బృందాలు సున్నిత ప్రాంతాలలో సిద్ధంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిర్వహణ, ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు, డైవర్షన్ మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలను ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేయాలని డిసిపి బాలస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ పీస్ కమిటీ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఫరీదుద్దీన్ యూనుస్ మాట్లాడుతూ… శాంతి, సామరస్యము రెండు పండుగ కమిటీలు పరస్పర సామరస్యాన్ని కాపాడాలి, ఊరేగింపుల సమయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, నాలుగు డివిజన్ల ఏసీపీలు, ఈస్ట్ జోన్లోని 10 ఎస్హెచ్ఓలతో పాటు ఈస్ట్ జోన్ పీస్ కమిటీ అధ్యక్షుడు ఎస్.నారాయణరెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ శరద్ శ్యామ్, ఈస్ట్ జోన్ కన్వీనర్ సయ్యద్ ఖాలిద్ షా, కో-ఆర్డినేటర్ శ్రీలత, సభ్యుడు సర్ధార్ బసంతి కూర్ తదితరులు పాల్గొన్నారు. 
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply