Saturday, September 19, 2026
No menu items!
HomeAPగూగుల్‌ సీఈవోతో మంత్రి లోకేశ్‌ భేటీ

గూగుల్‌ సీఈవోతో మంత్రి లోకేశ్‌ భేటీ

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ (Minister Lokesh) పర్యటన కొనసాగుతోంది. గూగుల్‌ సీఈవో (Google CEO) సుందర్‌ పిచాయ్‌తో ఆయన భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. డ్రోన్‌ సిటీలో అసెంబ్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఇంటెల్ ఐటీ సీటీవో శేష కృష్ణపురతో లోకేశ్‌ భేటీ అయ్యారు. ఏపీలో ఇంటెల్ ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిలో ఇంటెల్ ఏఐ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.

ఈ పర్యటనలో అడోబ్ సీఈవోతో లోకేష్ భేటీ..

ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం, అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తో కూడా నారా లోకేష్ సమావేశమయ్యారు. విశాఖపట్నంలో గ్లోబల్ క్యాపబిలిటీ / డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని అడోబ్‌ను ఈ సందర్బంగా మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ‘‘శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్‌తో మళ్లీ సమావేశం కావడం గొప్పగా అనిపించింది. డిజిటల్ ఆవిష్కరణలలో ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని బలోపేతం చేస్తూ, విశాఖపట్నంలో గ్లోబల్ క్యాపబిలిటీ / డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నేను అడోబ్‌ను ఆహ్వానించాను. ఫ్యాబ్‌లెస్ డిజైన్, పరిశోధనలలో లోతైన సహకారం గురించి, అలాగే హెల్త్-టెక్, లైఫ్ సైన్సెస్ పెట్టుబడుల కోసం మా ప్రపంచ స్థాయి ఏఎంటీజెడ్, ఫార్మా జోన్‌లను ఉపయోగించుకోవడం గురించి కూడా చర్చించాను’’ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page