అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: గడిచిన ఐదేండ్ల వ్యవధిలో 9 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు. భారత పౌరసత్వం విషయంలో పార్లమెం ట్లో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమా ధానంలో ఆయన ఈ డేటాను వెల్లడించారు. భారత పౌరసత్వాన్ని వదులుకొనే వ్యక్తుల వార్షిక రికార్డులను ప్రభుత్వం భద్రపరుస్తోంద న్నారు. ఆ రికార్డుల ప్రకారం 2011..2019 మధ్య 11,89,194 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకొన్నారన్నారు. గత 14 సంవత్సరాలలో భారత్లోని 20 లక్షలకు పైగా ప్రజలు తమ పౌరసత్వాన్ని వదులుకొన్నట్లు తెలిపారు.
దీంతో విదేశీ పౌ రసత్వాన్ని ఎంచుకునే భారతీయుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నట్లు విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విదేశాలలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న పలువురు భారత యువతీ యువకులు మోస పూరిత ఉద్యోగ ఆఫర్ల బారిన పడుతున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. గల్ఫ్ దేశాలలో ఉద్యోగాల కోసం.. భారత్ యువత నకిలీగల్ఫ్ ఉద్యోగ ఆఫర్లకు ఆకర్షితులై అక్రమ రవాణా నెట్వర్క్స్ బారిన పడుతున్నారని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవల ఇటువంటి కేసులు తమ దృష్టికి వచ్చాయన్నా రు. వీటిని నివారించడానికి సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ప్రకటనల ద్వారా విదేశాంగ శాఖ యువతకు అవగాహన కల్పిస్తోందన్నారు. నమోదు కాని ఏజెంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply