Saturday, September 19, 2026
No menu items!
HomeAPవాటాలు పంచుకోవడంలో ప్రభుత్వ పరువు తీస్తున్న మంత్రులు – టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం...

వాటాలు పంచుకోవడంలో ప్రభుత్వ పరువు తీస్తున్న మంత్రులు – టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా

📰 Generate e-Paper Clip

వాటాలు పంచుకోవడంలో ప్రభుత్వ పరువు తీస్తున్న మంత్రులు

– టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా

హైదరాబాద్, అక్టోబ‌ర్ 25, అద్దం న్యూస్ :     సమ్మక్క సారక్క మేడారం జాతర కొరకు ప్రభుత్వం కేటాయించిన 100 కోట్ల రూపాయలలో వాటాలు పంచుకోవడంలో తేడాలు వచ్చి గొడవపడిన రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ పరువును తీస్తున్నారని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. శ‌నివారం హైదరాబాద్ దోమలగూడలోని టీడీపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ.. రిజ్వి అనే ఐఏఎస్ అధికారి నిన్న అకస్మాత్తుగా రాజీనామా చేయడం వెనక… విఆర్ఎస్ తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వస్తున్న ఒత్తిళ్లను భరించలేక కమిషన్లు సర్ధుబాటు చేయలేక తప్పుకున్నాడన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి కప్పం కట్టడానికి, వాటాలు పంచుకొని ఆస్తులు పెంచుకోవడానికి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రిజ్వి సేవలను మెచ్చి జెన్ కో సీఎండీగా.. ట్రాన్స్ కో సిఎండిగా ఆయనకు అవకాశం కల్పించారన్నారు. అటువంటి ఆయనకు ప్రభుత్వంపై కోపం వచ్చి పదేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ వీఆర్ఎస్ తీసుకుని రాజీనామా చేయడం అంటే సంబంధిత మంత్రి జూపల్లి అవినీతి ఆగడాలను తట్టుకోలేక… ముఖ్యమంత్రి కార్యాలయానికి కమీషన్లను సర్దుబాటు చేయలేక ఒత్తిడి భరించలేక పదేళ్ల సర్వీసు ఉన్నా ఉద్యోగానికి రాజీనామా చేసి తప్పుకున్నారని తెలిపారు. వీటన్నిటిని చూస్తే ప్రభుత్వ ఖజానాను దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులు పోటీపడుతున్నట్లు రుజువు అవుతుందని అన్నారు. ఇచ్చిన హామీలేవి నెరవేర్చక ఈ విధంగా ప్రజల సొమ్ము దోచుకుంటూ, తమ పదవులు కాపాడుకోవడానికి ఢిల్లీకి కప్పం కొడుతూ కాలక్షేపం చేస్తున్నారని, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న చందంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఖజానాలను లూటి చేయడానికి కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారని, ప్రజలు గమనిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే వీరికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, కిరణ్, భాను ప్రకాష్. శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Advertisement


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page