వినాయక నిమజ్జనంలో అపశృతి
ఆరుగురు మృతి
పటాన్‌చెరు, సెప్టెంబర్ 16, ( అద్దం న్యూస్ ) : వినాయక నిమజ్జనంలో అపశృతి జరిగింది. నిమజ్జనానికి వెళ్లిన వారిలో ఆరుగురు విద్యార్థులు కుంటలో పడి మృతి చెందారు. వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామ శివారులోని శిరీష అనాథాశ్రమం విద్యార్థులు వెళ్లారు. వారిలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో అనాథాశ్రమానికి చెందిన 6 మంది దుర్మరణం చెందారు. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.













Leave a Reply