పైప్‌లైన్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

 

పైప్‌లైన్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

పైప్‌లైన్ల కోసం ధ‌ర్నాలు చేసిన మాకు స‌మాచారం ఇవ్వ‌రా – శ్రీను నాయుడు

 

క‌లుషిత నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని గ‌తంలో జ‌ల‌మండ‌లి కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా చేస్తున్న శ్రీను నాయుడు త‌దిత‌రులు

క‌లుషిత నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని గ‌తంలో జ‌ల‌మండ‌లి కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా చేస్తున్న శ్రీను నాయుడు త‌దిత‌రులు

 

హైద‌రాబాద్‌, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ జెవి హై స్కూల్ వీధిలో రూ.4.50 ల‌క్ష‌ల నిధుల‌తో నిర్మించ‌నున్న సివ‌రేజి పైప్‌లైన్ ప‌నుల‌కు బుధ‌వారం శంకుస్థాప‌న జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై వాట‌ర్ వ‌ర్క్స్ మేనేజ‌ర్ శివ‌తో పైప్‌లైన్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ… నియోజ‌క‌వ‌ర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప‌నుల‌న్నింటిని త్వ‌ర‌లోనే పూర్తి చేస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ మీడియా ఇన్‌చార్జ్ ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్‌, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ఖ‌లీల్‌, యూనుస్‌, ల‌క్ష్మీప‌తి, బొట్టు శ్రీనివాస్‌, మేడి స‌త్య‌నారాయ‌ణ‌, రామ‌స్వామి, హ‌రీష్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

పైప్‌లైన్ల కోసం ధ‌ర్నాలు చేసిన మాకు స‌మాచారం ఇవ్వ‌రా – శ్రీను నాయుడు

ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న శ్రీను నాయుడు

                                                ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న శ్రీను నాయుడు

అడిక్‌మెట్ డివిజ‌న్ అభ‌యాంజ‌నేయ‌స్వామి దేవాల‌యం ఎదురుగా ఉన్న స్ట్రీట్ నంబ‌ర్ 20లో తాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని, క‌లుషిత నీటి స‌ర‌ఫ‌రాను అరిక‌ట్టాల‌ని గ‌త కొన్నేళ్లుగా పోరాటం చేస్తే ఈ రోజు మా వీధిలో డ్రైనేజీ పైప్‌లైన్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తుంటే మాకు స‌మాచారం ఇవ్వ‌రా అని స్థానికుడు శ్రీను నాయుడు ప్రశ్నించారు. బుధ‌వారం పైప్‌లైన్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తుంటే శ్రీను నాయ‌కుడు వ‌చ్చి అధికారుల‌పై, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుల పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఖైర‌తాబాద్‌లోని జ‌ల‌మండ‌లి కార్యాల‌యం ముందు అర్థ‌న‌గ్నంగా ధ‌ర్నాలు చేశామ‌ని, మేము చేసిన ధ‌ర్నాకు స్పందించి వాట‌ర్ వ‌ర్క్స్ డిజిఎం మోహ‌న్‌రాజ్ త‌దిత‌రులు మా వీధిలో ప‌ర్య‌టించి 12 ల‌క్ష‌ల నిధులు మంజూరు అయ్యాయ‌ని తెలిపారు. తీరా ఇప్పుడు బ‌డ్జెట్ మంజూరు అయి ప‌నులు ప్రారంభం అవుతున్న స‌మ‌యంలో మాకు స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డం అన్యాయ‌మ‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page