Friday, September 18, 2026
HomeHyderabadరూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ముషీరాబాద్ రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌

రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ముషీరాబాద్ రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌

హైద‌రాబాద్‌, మే 28, అద్దం న్యూస్ :   ఒక వ్య‌క్తికి సంబంధించిన ఫ్యామిలీ స‌ర్టిఫికెట్ కోసం ల‌క్ష రూపాయ‌ల‌ను డిమాండ్ చేసిన ముషీరాబాద్ త‌హ‌శిల్థార్ కార్యాల‌యం రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్ రూ.25 వేల రూపాయ‌లు లంచం తీసుకుంటుండ‌గా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అతన్ని ప‌ట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి… ముషీరాబాద్ త‌హ‌శిల్థార్ ప‌రిధిలో ఒక వ్య‌క్తి త‌న కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ స‌ర్టిఫికెట్ కోసం ద‌ర‌ఖాస్తు చేశాడు. త‌హ‌శిల్థార్ కార్యాల‌యంలో రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్న భూపాల మ‌హేష్ ల‌క్ష రూపాయ‌ల లంచం ఇస్తే స‌ర్టిఫికెట్ ఇస్తా అని చెప్పాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అవినీతి నిరోధక శాఖ అధికారుల ప‌థ‌కం ప్రకారం బుధ‌వారం ముషీరాబాద్ త‌హ‌శిల్థార్ కార్యాల‌యంలో రూ. 25 వేల రూపాయ‌ల లంచాన్ని మ‌హేష్ తీసుకుంటుండ‌గా ఏసీబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు.

ఎవ‌రైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబ‌ర్‌కు డ‌య‌ల్ చేయండి :

ఎవ‌రైనా ప్ర‌భుత్వ ఉద్యోగి లంచం అడిగిన‌ట్ల‌యితే ప్ర‌జ‌లు అవినీతి నిరోధక శాఖ వారి 1064 టోల్ ఫ్రీ నంబ‌ర్‌కు ఫోన్ చేసి స‌మాచారం ఇవ్వాల‌ని అవినీతి నిరోధక శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే వాట్సాప్ ( 9440446106) కు, ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించవచ్చునని అధికారులు తెలిపారు. ఫిర్యాదుధారులు, బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడుతాయ‌ని అధికారులు చెప్పారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page