Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadతెలంగాణలో సహకార సంఘాల బలోపేతానికి నాబార్డ్ వర్క్‌షాప్

తెలంగాణలో సహకార సంఘాల బలోపేతానికి నాబార్డ్ వర్క్‌షాప్

📰 Generate e-Paper Clip

తెలంగాణలో సహకార సంఘాల బలోపేతానికి నాబార్డ్ వర్క్‌షాప్

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 03, అద్దం న్యూస్ :    జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ ( నాబార్డ్ ) తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వశాఖ, తెలంగాణ సహకార శాఖతో కలిసి అంతర్జాతీయ సహకార సంవత్సరం – 2025 లోని “Cooperatives Build a Better World” అనే థీమ్‌ కింద హైదరాబాద్‌లోని డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో “సహకార సంఘాల బలోపేతం” పై ప్రాంతీయ వర్క్‌షాప్ బుధ‌వారం జ‌రిగింది. ఈ కార్యక్రమంలో కొత్త మల్టీపర్పస్ ప్రైమరీ అగ్రి కల్చరల్ క్రెడిట్ సొసైటీల ( M PACS ) స్థాపన, ఇప్పటికే ఉన్న PACS / M PACS ల కార్యకలాపాల విస్తరణ, రైతుల ఉత్పత్తిని కాపాడేందుకు ధాన్య నిల్వ సదుపాయాల నిర్మాణం వేగవంతం చేయడం, PACS కంప్యూటరైజేషన్ ద్వారా పారదర్శకత–ప్రభావిత్వం సాధించడం వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ, రాష్ట్ర సహకార శాఖలు, ఎఫ్‌సీఐ, ఆహార–పౌర సరఫరా శాఖలు, రాష్ట్ర సహకార బ్యాంకులు, ఎన్‌డీడీబీ, ఎన్‌ఎఫ్‌డీబీ, తెలంగాణ డీడీడీసీఎఫ్‌ నుండి సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నాబార్డ్ చైర్మన్ శాజి కెవి మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా PACS కంప్యూటరైజేషన్ ప్రాజెక్ట్ మంచి ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు 52,500 కి పైగా PACS డే-ఎండ్ ఆపరేషన్స్ పూర్తి చేశాయని, 9,000 కి పైగా PACS డైనమిక్ డే-ఎండ్ నిర్వహిస్తున్నాయన్నారు. అలాగే 33,000 కి పైగా ఆడిట్లు ఈ పిఎసిఎస్ సాఫ్ట్‌వేర్‌ ద్వారా పూర్తయ్యాయన్నారు. అదనంగా 7,500 కి పైగా పిఎసిఎస్ లను ఇప్పటికే ఈ PACS only గా గుర్తించారన్నారు. ఆయన రాష్ట్ర సహకార బ్యాంకులను “సహకారి సారథి” ప్లాట్‌ఫార్మ్‌లో చేరి రైతులకు సులభమైన సేవలు అందించామని సూచించారు. కంప్యూటరైజేషన్ ద్వారా ఏర్పడిన డిజిటల్ వేదిక సహకార సంఘాలకు వ్యాపార నమూనాలను విస్తరించడానికి, ఈ-మార్కెటింగ్ ప్రారంభించడానికి, గ్రామీణ సమాజానికి డిజిటల్ సేవలు అందించడానికి దోహదం చేస్తుందన్నారు. వ్యాపార ప్రక్రియల పునర్వ్యవస్థీకరణ, ఉన్నతస్థాయి సహకార సంస్థలు, కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లతో సమీకరణ ద్వారా పని తీరు మెరుగవుతుందన్నారు. పునరావృతం తగ్గుతుంది, ఆర్థిక సమగ్రత పెరుగుతుందని తెలిపారు. ఇదే సమయంలో 29,000 PACS లో ధాన్య నిల్వ కేంద్రాల నిర్మాణం జరుగుతున్న గ్రైన్ స్టోరేజ్ ప్లాన్ రైతులకు మద్దతు ఇవ్వడంలో, మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడంలో, గ్రామీణ ఆదాయాన్ని పెంపొందించడంలో సహాయ పడుతుందన్నారు.

సహకార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సిద్ధార్థ్ జైన్ మాట్లాడుతూ… సహకార సంఘాలు గ్రామీణ సమృద్ధిని పెంచడంలో, ఆహార భద్రతను మెరుగుపరచడంలో, సమగ్ర అభివృద్ధిని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఆయన PACS లు సాంకేతికతను స్వీకరించడం ద్వారా గ్రామీణ–పట్టణ అంతరాలను తగ్గించాలని సూచించారు. అలాగే డిసిసిబి ల బోర్డు సభ్యులు, PACS ల‌కు exposure visits ఏర్పాటు చేసి, కొత్త వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేయడం, స్టార్టప్‌లతో అనుసంధానం కల్పించామని సూచించారు. నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ బి.ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ… బహుళ సంస్థల కార్యక్రమాల సమన్వయం, సహకార బ్యాంకింగ్ బంధాలను బలోపేతం చేయడం, సహకార సంఘాల వ్యాపార కార్యకలాపాలను వినియోగించడం, లక్ష్యిత శిక్షణ–సాంకేతిక స్వీకరణ ద్వారా సంస్థల సామర్థ్యాలను పెంపొందించడం అవసరమని చెప్పారు. నాబార్డ్ డిప్యూటీ ఎండి జిఎస్.రావత్ మాట్లాడుతూ… రాష్ట్ర స్థాయి విజయాలను పంచుకోవడం, సాధ్యమైన పరిష్కారాలను గుర్తించడం, భవిష్యత్‌ రోడ్ మ్యాప్ సిద్ధం చేయడం ద్వారా సహకార సంఘాలు మరింత బలోపేతమై స్వయం సమృద్ధిగా మారి సభ్యులకు, గ్రామీణ సమాజానికి మెరుగైన సేవలు అందించగలవని తెలిపారు. ఈ వర్క్‌షాప్ ద్వారా నాబార్డ్ సహకార సంఘాలను శక్తివంతం చేయడంలో, క్రెడిట్ ప్రవాహాన్ని సులభతరం చేయడంలో సహకార పాలన సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో తమ కట్టుబాటు పునరుద్ఘాటించిందన్నారు. ఈ వర్క్‌షాప్‌లో నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గోవర్ధన్ సింగ్ రావత్, ముంబై నాబార్డ్ సిఎస్‌డిడి సీజిఎం సంజయ్ కుమార్ గుప్తా, మినిస్ట్రీ ఆఫ్ కో-ఆపరేషన్ డైరెక్ట‌ర్ పంకజ్ శ్రీవాస్తవ్, ముంబై నాబార్డ్ డిప్యూటీ ఎండి జీఎస్. రావత్, ముంబై నాబార్డ్ జిఎస్‌డి సిజీఎం డా.సుమన్ కుమార్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page