బాలకృష్ణ కు వరల్డ్ బుక్ ఆఫ్ రికాడ్స్ గోల్డన్ ఎడిషన్ పురస్కారం దక్కడం హర్షణీయం – టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా

హైదరాబాద్, ఆగస్టు 25, అద్దం న్యూస్ :నందమూరి బాలకృష్ణ కు లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికాడ్స్ ( డబ్య్లుబిఆర్ ) గోల్డన్ ఎడిషన్ పురస్కారం దక్కడం హర్షణీయమని టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. సోమవారం హైదరాబాద్ దోమలగూడలోన్ నగర టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… తెలుగు చలనచిత్ర రంగంలో నటుడిగా రంగ ప్రవేశం చేసి అగ్ర కథానాయకుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని నటుడిగా తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్ టి రామారావు ప్రమేయం లేకుండా రాజకీయాలకు అతీతంగా స్వశక్తితో ఎదిగి, సినిమా రంగంలో రాణిస్తున్న నటుడు నందమూరి బాలకృష్ణ అని అన్నారు. సినీ కళాకారునిగా ఈనాటికి కూడా తెలుగు చలనచిత్ర రంగంలో చరిత్ర సృష్టించారన్నారు. అంతే కాకుండా తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యునిగా ప్రజాభిమానంతో మూడుసార్లు హ్యాట్రిక్ సాధించారని తెలిపారు.

నందమూరి బాలకృష్ణ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ గా పేద రోగులకు, క్యాన్సర్ పీడితులకు చికిత్స నిర్వహిస్తూ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఎంతో అభివృద్ది చేసి దేశంలోనే గొప్ప ఆసుపత్రిగా తీర్చిదిద్దిన ఘనుడు. నందమూరి బాలకృష్ణ సేవలను పురస్కరించుకుని ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కిందని పేర్కొన్నారు ఎవరి ప్రలోభాలకు లోనుకాకుండా తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకున్న నందమూరి బాలకృష్ణ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, భానుప్రకాష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page