హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ : హైదరాబాద్ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ, ఈస్ట్ జోన్ యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ముషీరాబాద్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో, అడిక్‌మెట్‌లో డాక్టర్.విఘ్నేష్ క్లీనిక్‌లో, మియా బజార్ యుపిహెచ్‌సి సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సమాజానికి అంకితభావంతో సేవలందిస్తున్న ప్రముఖ వైద్యులను సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఈస్ట్ జోన్ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఫరీదుద్దీన్ యూనిస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మీర్ దస్తగిర్ అలీ, న్యాయవాది శ్రీనివాస్ రావు, యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి ఎల్.శ్రీలత, పీస్ కమిటీ కార్యవర్గ సభ్యులు జి.మనీలా విజయలక్ష్మి, అవైస్ మీర్జా, తూర్పు జోన్ కార్యవర్గ సభ్యుడు అబ్దుల్ హఫీజ్, ఈస్ట్ జోన్ పీస్ కమిటీ సభ్యుడు మొహమ్మద్ సిద్ధిక్, హైదరాబాద్ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ కన్వీనర్ సయ్యద్ ఖలీద్ షా చిష్తి హుస్సేని, డేనియల్ టోనీ అండ్ ఫ్రెండ్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్.విఘ్నేష్ క్లీనిక్‌లో డాక్టర్.విఘ్నేష్‌కు హైదరాబాద్ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఈస్ట్ జోన్ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఫరీదుద్దీన్ యూనిస్ శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అబ్బు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply