ప్రజా సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం
– మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన
హైదరాబాద్, జూలై 9, ( అద్దం న్యూస్ ) : ప్రజా సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన విమర్శించారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్ర క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ” తెలుగుదేశం – ప్రజాపథం ” కార్యక్రమం మాజీ కార్పోరేటర్ పలుస బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లి డివిజన్, చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద జరిగింది. శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన, సికింద్రాబాద్ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ నల్లెల్ల కిషోర్, రాష్ట్ర నాయకులు పి.అశోక్, జివిజి నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్బంగా మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల మధ్యే ఉంటూ వారి కష్ట సుఖాల్లో భాగస్వాములయ్యే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ, పంపిణీ వెంటనే చేపట్టాలని, అర్హులైన వారందరికి ఇళ్లను కేటాయించాలన్నారు.
టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ నల్లెల్ల కిషోర్ మాట్లాడుతూ… ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, కాలేజీ విద్యార్థులకు రావలసిన స్కాలర్‌షిప్ బాకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తెలుగుదేశం – ప్రజాపథం కార్యక్రమంలో పార్లమెంట్ నాయకులు నేరుగా పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోని, వాటి పరిష్కారం కొరకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను నాయకుల దృష్టికి తెచ్చారని తెలిపారు. మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్ గౌడ్ మాట్లాడుతూ… రాంనగర్, బాగ్‌లింగంపల్లి ప్రాంతాల్లో డ్రైనేజి పైప్‌లైన్లు, పాడైపోయిన సీసీ, బీటీ రోడ్లు, తీవ్రమైన నీటి ఎద్దడి, కరెంట్ కోతలు వంటి సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని ఈ కార్యక్రమంలో గుర్తించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అలాగే సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం చూపుతున్న వివక్షపై మండిపడ్డారు.
టిడిపి తెలంగాణా రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పి.అశోక్ మాట్లాడుతూ… ఆంధ్రాలో దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇస్తుంటే, ఇక్కడ కేవలం రూ.3 వేల ఇవ్వడం దారుణమని తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని, సమయాన్ని ప్రభుత్వం పెంచాలని ప్రజలు డిమాండ్ చేశారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో సుమారు 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ రెండేళ్లలోనే 3 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని, ” పెద్ద దొర పోయి చిన్న దొర వచ్చారు ” తప్ప ప్రజల బతుకులు మారలేదని నాయకులు ఆరోపించారు. ప్రజలు మళ్లీ తెలుగుదేశం పార్టీ పాలన రావాలని ఎదురుచూస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆకర్షితులై 5 గురు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపగా, వారికి పార్టీ నాయకులు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు ఎంకె.బోసు, జివిజి నాయుడు, డివిజన్ అధ్యక్షుడు చంద్రమోహన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ గుప్త, శంకర్‌గౌడ్, ప్రమీల, కాసుల సుదర్శన్ రెడ్డి, తడక వినోద్, భాను ప్రకాష్, వంశీకృష్ణ, రాజేంద్రప్రసాద్, ఎం.చిత్ర, గండికోట విజయ్, మశ్చీందర్, బి.రాజు, రవి, సత్తన్న, భవాని శ్రీనివాస్, ఆనంద్, అనిల్, శక్తి ప్రేమ్, కాతా విజయ్, విక్రం, మల్లిఖార్జున్, యాదగిరి, ప్రసాద్, రామారావు తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply