రాంనగర్ చౌరస్తాలో విషాదం
గణేష్ ఆగామన్ లో తోపులాట
యువకుడి మృతి
హైదరాబాద్ క్రైమ్, సెప్టెంబర్ 5, ( అద్దం న్యూస్ ) : వినాయకచవితిని పురస్కరించుకుని వినాయక విగ్రహాలను తీసుకొచ్చే క్రమంలో నిర్వహించే ఆగామన్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ రాంనగర్ శ్రీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన గణేష్ ఆగామన్ వేడుకకు వేలాదిగా నగరవాసులు, యువకులు తరలివచ్చారు. ఈ క్రమంలో తీవ్ర తొపులాట జరిగింది. అదే సమయంలో ఓ యువకుడు కిందపడిపోయాడు. కొంత మంది యువకులు చూడగా ఆ యువకుడు మృతి చెంది ఉన్నాడు. విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. మృతుడిని ముషీరాబాద్‌కు చెందిన బద్రీనాథ్‌గా పోలీసులు గుర్తించారు. బద్రీనాథ్‌కు సడెన్‌గా గుండెపోటు వచ్చిందా ? లేక భారీగా తరలివచ్చిన జనంతో జరిగిన తొక్కిసలాట కారణంగా అస్వస్థతకు గురయ్యాడా ? అనే అంశం పై ప్రస్తుతం స్పష్టత లేదు. మృతికి అసలు కారణం ఏంటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం మృతికి గల అసలు కారణంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.














Leave a Reply