Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadసామాన్యుడిని దోచుకునే ల‌క్ష్యం ఉంటే ఏ ప్ర‌భుత్వానికి మ‌న‌గ‌డ ఉండ‌దు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్...

సామాన్యుడిని దోచుకునే ల‌క్ష్యం ఉంటే ఏ ప్ర‌భుత్వానికి మ‌న‌గ‌డ ఉండ‌దు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబ‌

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, ఏప్రిల్ 8, అద్దం న్యూస్ :   ఎంతసేపు సామాన్యుడిని దోచుకోవాలనేదే లక్ష్యంగా పెట్టుకుంటే ఏపార్టీ కూడా ప్రభుత్వంలో ఉన్నా ఆ ప్ర‌భుత్వం మనగడ కొనసాగించలేదని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబ అన్నారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ…. దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే సామాన్యుడు హలో లక్ష్మణా ! అంటూ అర్థాకలితో జీవనం సాగిస్తున్న సమయంలో వంటగ్యాస్ పై కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు పెంచడం అత్యంత దారుణ‌మ‌న్నారు. ఈ చర్య పేద ప్రజల బతుకులపై పెను ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రం నుండి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఇద్దరు కూడా ఈ విషయంపై ఆలోచించి కేంద్ర ప్రభుత్వానికి వంటగ్యాస్ పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. తెలంగాణ నుండి 8 మంది బిజెపి ఎంపీలను గెలిపించిన రాష్ట్ర ప్రజలకు కేంద్రం ఇస్తున్న కానుక ఇదేనా అని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పతనమవుతున్నా ఈ విధంగా పెట్రోలు, డిజిల్, వంట గ్యాస్ ధరలు పెంచడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు సతమత మవుతుంటే, మరొక ఆశని పాతంలా వంటగ్యాస్ ధరలు పెరగడం నిజంగా సామాన్యుని నడ్డి విరచడమే అవుతుందన్నారు. ఈ నిర్ణయం పై కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచించి ఉంచాలని డిమాండ్ చేశారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకుని సామాన్యుని ఆదుకునే మార్గాలను వెతకడానికి ప్రయత్నించాలని అన్నారు. ఈ స‌మావేశంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు కార్యక్రమంలో నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page