గంటల వ్యవధిలోనే లక్షల్లో లైక్స్
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి ఆగిపోవడం, రద్దవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కొద్దిగంటల్లోనే పెళ్లి ఆగిపోవడం, ఆ తర్వాత రద్దు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సమయంలో ఆమె ప్రైవసీని గౌరవించాలని కోరింది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన యాడ్ వీడియో, అందులోని క్యాప్షన్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 17 గంటల్లోనే దాదాపు పది లక్షల లైక్స్ వచ్చాయి. తన జీవితంలో జరుగుతున్న వాటి నుంచి బయటపడటానికి క్రికెట్ ఆడటమే మార్గమని స్మృతి మంధాన నిర్ణయించుకుంది.
స్మృతి మంధాన ఇప్పుడు హాటి టాపిక్ ఆఫ్ ఇండియా అయింది. మ్యారేజ్ సెలబ్రేషన్స్ నుంచి పెళ్లి ఆగిపోవడం వరకూ ప్రతిదీ ఓ సెన్సేషనలే. కొద్దిగంటల్లో తాళి కడతారు అనగా సినిమా స్టయిల్‌లో పెళ్లి ఆగిపోయింది.. ఆ తర్వాత ఏకంగా రద్దయింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో నెటిజన్లు స్మృతి మంధానకి ఫుల్ సపోర్ట్‌గా నిలిచారు. తాజాగా ఇన్‌స్టాలో ఓ యాడ్ వీడియో పోస్ట్ చేసిన స్మృతి, దానికి పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇలాంటి సమయంలో స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్‌లో “ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నామంటే, సైలెంట్‌గా ఉంటున్నానని కాదు.. అది నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నట్టు” అంటూ ఓ పోస్ట్ చేసింది. అది ఒక ఫోన్ యాడ్ అయినప్పటికీ చూసేవాళ్లకి మాత్రం తన గురించి తాను చెబుతున్నట్టే అనిపించింది. అందులోని పదాలు కూడా ప్రస్తుతం ఆమె జీవితానికి సరిపోయేలా ఉన్నాయి. దాంతో ఆ పోస్ట్‌కి గంటల వ్యవధిలోనే లక్షల కొద్ది లైక్స్ వచ్చాయి.
“నా పెళ్లి రద్దయింది అని స్పష్టంగా చెబుతున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో ముగించండి. గత కొన్ని వారాలుగా నాపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని. కానీ నిజం చెప్పాల్సిన అవసరం అనిపించింది” అంటూ పెళ్లి రద్దు అయిన సమయంలో స్మృతి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లకు తెలిపింది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply