Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadలీకేజీని అరికట్టిన అధికారులు – అధికారులు, సిబ్బందిని అభినందించిన ఎండీ అశోక్‌రెడ్డి

లీకేజీని అరికట్టిన అధికారులు – అధికారులు, సిబ్బందిని అభినందించిన ఎండీ అశోక్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

 

     లీకేజీని అరికట్టిన అధికారులు

 – అధికారులు, సిబ్బందిని అభినందించిన ఎండీ అశోక్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 27, అద్దం న్యూస్ :   జ‌ల‌మండ‌లి ఓ అండ్ ఎం డివిజ‌న్ నం-4 రెడ్ హిల్స్ ప‌రిధిలోని మొజాంజాహి మార్కెట్ లో లీకేజీని అధికారులు అరిక‌ట్టారు. మొజాంజాహి మార్కెట్ సమీపంలో, 350 డయా ఎంఎం పైప్‌లైన్‌ పై సరఫరా సమయంలో నీటి లీకేజీ గుర్తించారు. మలకుంట రోడ్, రిసాలా అబ్దుల్లా, ఒస్మాన్‌గంజ్, శంకర్‌బాగ్, టాప్ ఖానా ప్రాంతాలలో సుమారు 700 ఇళ్లకు నీటి సరఫరా ప్రభావితం కాకుండా లీకేజీని తక్షణమే అరికట్టాలని నిర్ణయించారు. ఈ లీకేజీ గుర్తించిన ప్రదేశం ప్రధాన రహదారిపై ఉండడం, చాలా రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు మధ్య భాగంలో ఉండడంతో ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్, పోలీస్ అధికారులతో సమన్వయంతో పనులు చేపట్టి కేకేజీని సమస్య పరిష్కరించారు.
ప్రధాన రహదారిపై ఉన్న పనులు చేపట్టి లీకేజీని సమస్య పరిష్కరించి సరఫరా పునరుద్ధరించిన అధికారులు, సిబ్బందిని ఎండీ అశోక్‌రెడ్డి అభినందించారు. భవిష్యత్తులోనూ ఇలాగే కష్టపడి పనిచేయాలని సూచించారు. సీజీఎం, జీఎంతో సహా బృందం చేసిన పని నిజంగా అభినందనీయమైనది అన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page