Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADSIR ప్ర‌క్రియ‌తోనే ఒటు హ‌క్కును ప‌రిర‌క్షించుకోవాలి

SIR ప్ర‌క్రియ‌తోనే ఒటు హ‌క్కును ప‌రిర‌క్షించుకోవాలి

📰 Generate e-Paper Clip

SIR ప్ర‌క్రియ‌తోనే ఒటు హ‌క్కును ప‌రిర‌క్షించుకోవాలి
– సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, జూలై 21, ( అద్దం న్యూస్ ) :   ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారానే తమ ఓటు హక్కును పరిరక్షించుకోగలుగుతారని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని అడ్డగుట్టలో బీఆర్ఎస్ నాయకులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ సహాయత శిబిరాలను పద్మారావు గౌడ్ మంగళవారం సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ప‌ద్మారావు గౌడ్ మాట్లాడుతూ… బూత్ లెవెల్ సహాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని తద్వారనే అర్హుల ఓట్లు కోల్పోకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. ఓటర్ల సహాయానికి సీతాఫల్‌మండీలోని ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ కార్పొరేటర్ లింగని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్, బీఆర్ఎస్ యువ నాయకుడు తీగుళ్ళ రామేశ్వర్ గౌడ్, రాజా సుందర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page