వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఎన్నికలను నిర్వహించాలి – బీజేపీ తెలంగాణ సంస్థాగత ఎన్నికల కో – రిటర్నింగ్ అధికారిణి గీతా మూర్తి

వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమావేశంలో పాల్గొన్న‌ గీతా మూర్తి, సంత‌కం చేస్తున్న గీతామూర్తి

                                     వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమావేశంలో పాల్గొన్న‌ గీతా మూర్తి, సంత‌కం చేస్తున్న గీతామూర్తి

అంబ‌ర్‌పేట్‌, మే 19, అద్దం న్యూస్ :   వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఎన్నికలను నిర్వహించాలని బీజేపీ తెలంగాణ సంస్థాగత ఎన్నికల కో – రిటర్నింగ్ అధికారిణి గీతా మూర్తి అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమావేశంలో గీతా మూర్తి పాల్గొని జమిలి ఎన్నికలకు మద్దతుగా సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఒకేసారి అన్ని ఎన్నికలు నిర్వహించినప్పుడే ఖర్చులు, సమయం ఆదా అవుతాయన్నారు. గతంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, మొన్న ఎమ్ఎల్‌సి ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. ఈ సంవత్సరం కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయని, వీటి వల్ల ఖర్చు, సమయం వృధా అవుతుందని వివరించారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ ఒకే దేశం ఒకే ఎన్నిక పద్ధతి ఉండాలని చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జమిలి ఎన్నికలకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా లీగల్ సెల్ కన్వీనర్, మేడ్చల్ మల్కాజిగిరి ప్రధాన కార్యదర్శి ప్రసన్న తమ మద్దతును ప్రకటించి సంతకం చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page