Friday, September 18, 2026
HomeHyderabadఒకే దేశం, ఒకే ప్రధాని, ఒకే రాజ్యాంగం శ్యాంప్రసాద్‌ ముఖర్జీ ఆశయం – కార్పొరేట‌ర్ పావ‌ని...

ఒకే దేశం, ఒకే ప్రధాని, ఒకే రాజ్యాంగం శ్యాంప్రసాద్‌ ముఖర్జీ ఆశయం – కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

ఒకే దేశం, ఒకే ప్రధాని, ఒకే రాజ్యాంగం శ్యాంప్రసాద్‌ ముఖర్జీ ఆశయం

– కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

హైదరాబాద్, జులై 6, అద్దం న్యూస్ :  ఒకే దేశం, ఒకే ప్రధాని, ఒకే రాజ్యాంగం శ్యాంప్రసాద్‌ ముఖర్జీ ఆశయమ‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ అన్నారు. గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అశోక్‌న‌గ‌ర్ స్ట్రీట్ నంబ‌ర్ 2 బూత్ నంబ‌ర్ 272లో ఆదివారం డాక్ట‌ర్‌.శ్యామ్ ప్ర‌సాద్ ముఖ‌ర్జీ జ‌యంతి కార్య‌క్ర‌మంలో భాగంగా మొక్క‌ల నాటే కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ హాజ‌రై మొక్క‌ల‌ను నాటారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమైఖ్య భారత వని కోసం గాను ప్రాణాలర్పించిన త్యాగధనుడు శ్యాంప్ర‌సాద్ ముఖ‌ర్జీ అని అన్నారు. పార్టీ శ్రేణులందరూ డా.శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధన కోసం అంకితభావంతో ముందుకు సాగాలని కార్పొరేటర్ పావ‌ని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.నవీన్‌ కుమార్, ఆనంద్‌రావు, బూత్ 272 అధ్యక్షుడు వినయ్ ప్రసాద్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, విఎస్‌టి.రాజు, పి.నర్సింగ్ రావు, శివ కుమార్, శ్రీనివాస్, ప్రకాష్ యాదవ్, సత్యేంధర్, నర్సింహ, సాయి కుమార్, నీరజ్, యాదగిరి, రాజేందర్, సుక్క యాదగిరి, రహమత్ ఆలి, క్రాంతి, సంధ్యా రాణి, పూర్ణ, సంయుక్త రాణి, లక్ష్మి, కాలనీ వాసులు త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page