Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఎంపీటీసీ, జెడ్‌పిటిసి, మున్సిపల్, సహకార సంస్థల్లో దివ్యాంగుల‌కు అవకాశం ఇవ్వాలి – డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్...

ఎంపీటీసీ, జెడ్‌పిటిసి, మున్సిపల్, సహకార సంస్థల్లో దివ్యాంగుల‌కు అవకాశం ఇవ్వాలి – డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్

📰 Generate e-Paper Clip

ఎంపీటీసీ, జెడ్‌పిటిసి, మున్సిపల్, సహకార సంస్థల్లో దివ్యాంగుల‌కు అవకాశం ఇవ్వాలి
– డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్

హైదరాబాద్, డిసెంబ‌ర్ 20, అద్దం న్యూస్ :    త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే ఎంపీటీసీ, జెడ్‌పిటిసి, మున్సిపల్, సహకార సంస్థల్లో దివ్యాంగుల‌కు అవకాశం ఇవ్వాలని డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలోని సంఘం రాష్ట్ర కార్యాల‌యం వ‌ద్ద జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… గ‌తంలో ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారంగా దేశంలో.. రాష్ట్రంలో జనాభా ప్రాతిప‌దిక‌న‌ చట్ట ప్రకారం దివ్యాంగుల‌కు జ‌రుగ‌బోయే ఎంపీటీసీ, జెడ్‌పిటిసి, మున్సిపల్, సహకార సంస్థల్లో అవకాశం ఇవ్వాలన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం దివ్యాంగుల‌కు పెన్షన్ రూ.10 వేల సమాన అవకాశం ఇవ్వాల‌ని పార్లమెంట్ బిల్లు ఆమోదం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌కు విజ్ఞప్తి చేశారు. బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లతో పాటు ఎంపీటీసీ, జెడ్‌పిటిసి, మున్సిపల్, సహకార సంస్థల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ స‌మావేశంలో డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ స‌భ్యులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page