శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ( మల్లన్న ) దేవాలయంలో పంచాంగ శ్రవణం
హైదరాబాద్, మార్చి 19, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ బాకారంలో గల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ( మల్లన్న ) దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం జరిగింది. మేనేజింగ్ ట్రస్టీ నల్లవెల్లి అంజి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు మధు సూదన్, శివ సాయి పంచాంగాన్ని వినిపించారు. అంతకు ముందు ఆలయంలో వినాయక హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్ పర్సన్ నల్లవెల్లి ఊర్మిళా, నల్లవెల్లి మల్లిఖార్జున్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.![]()

![]()














Leave a Reply