ప్రజలకు అందుబాటులోకి పార్కులు – గాంధీన‌గ‌ర్ కార్పొరేటర్ ఎ.పావని

ప్రజలకు అందుబాటులోకి పార్కులు
– గాంధీన‌గ‌ర్ కార్పొరేటర్ ఎ.పావని

హైదరాబాద్, డిసెంబ‌ర్ 6, అద్దం న్యూస్ :    అన్ని హంగుల‌తో గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని పార్కుల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెస్తున్నామ‌ని స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ చంద్రకాంత్, మేనేజర్ ధీరజ్ వారి సిబ్బంది, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తో కలిసి కార్పొరేట‌ర్ పావ‌ని పనులు పూర్తైన పార్కులను పర్యవేక్షించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ… గాంధీనగర్ డివిజన్‌లోని పి అండ్ టి పార్క్ ( సురభి పార్క్), కెనరా బ్యాంక్ పార్కులు సుమారు రూ. 8 లక్షల జిహెచ్ఎంసి నిధులతో ఆహ్లాదకరమైన వాతావరణంతో అభివృద్ధి చెంది, అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా నిరూపయోగంగా ఉన్న పార్కులను, సీనియర్ సిటిజన్లకు, పిల్లలకు, స్థానికులకు, చక్కటి వాతావరణం, ఆహ్లాదకరమైన పచ్చటి చెట్లు, మొక్కలతో ఆధునీకరించి పార్కులను అందుబాటులోకి తెస్తున్నదుకు సంతోషకరంగా ఉంద‌న్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్, రాజ్ కుమార్, స్థానిక కాలనీ వాసులు కళావతి, రాజేశ్వరి, రాజు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page