Friday, September 18, 2026
HomeHyderabadసాయి ఈశ్వర చారి ఆత్మ బలిదానం వృధా పోదు – బిసి జేఏసి క‌న్వీన‌ర్ భూంపల్లి...

సాయి ఈశ్వర చారి ఆత్మ బలిదానం వృధా పోదు – బిసి జేఏసి క‌న్వీన‌ర్ భూంపల్లి అశోక్ దాదా

సాయి ఈశ్వర చారి ఆత్మ బలిదానం వృధా పోదు
– బిసి జేఏసి క‌న్వీన‌ర్ భూంపల్లి అశోక్ దాదా

హైదరాబాద్, డిసెంబ‌ర్ 6, అద్దం న్యూస్ :    సాయి ఈశ్వర చారి ఆత్మ బలిదానం వృధా పోదని తెలంగాణ‌ బిసి జేఏసి క‌న్వీన‌ర్ భూంపల్లి అశోక్ దాదా అన్నారు. అద్దం న్యూస్ ప్ర‌తినిధితో ఆయ‌న మాట్లాడుతూ… కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విధానం కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చి మోసం చేసినందుకు నిరసనగా, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు జరిగిన ఘోరమైన మోసం చూసి తట్టుకోలేక బీసీల ముద్దుబిడ్డ సాయి ఈశ్వర చారి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మ బలిదానం చేసుకున్నార‌న్నారు. బీసీలు తమ హక్కుల సాధన కోసం ఆర్.కృష్ణన్న ఆధ్వర్యంలో అనేక ఉధృత‌మైన ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఆరికటిక అభివృద్ధి సంఘం ఈ అమరవీరునికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మేము సైతం బీసీ ఉద్యమంలో ఖ‌చ్చితంగా పాల్గొని ఈ అమరుని ఆశయాన్ని సాధించేంత వరకు పోరాడుతామ‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page