Sunday, September 20, 2026
No menu items!
HomecinemaPeddi Movie: ‘పెద్ది’లో అప్పలసూరి ఫస్ట్ లుక్ రిలీజ్..

Peddi Movie: ‘పెద్ది’లో అప్పలసూరి ఫస్ట్ లుక్ రిలీజ్..

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘పెద్ది’. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగపతిబాబు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఆయన గతంలో ఎన్నడూ చూడని లుక్ లో సర్పైజ్ చేశారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కూడా నటిస్తున్నారనే విషయం రివీల్ అయింది. కన్నడ నటుడు శివరాజ్ కుమార్, బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే వీరి పాత్రలకు సంబంధించిన క్యారక్టర్ పోస్టర్లు రిలీజ్ చేశారు.

‘పెద్ది’ చిత్రంలో అప్పలసూరి అనే పాత్రలో జగపతిబాబు నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ”స్క్రీన్ మీద ఆయన తీసుకొచ్చిన ఇంటెన్సిటీని ఎవరూ మ్యాచ్ చేయలేరు. డియర్ జగ్గూ భాయ్ మా ‘పెద్ది’ సినిమాలో ‘అప్పలసూరి’గా నటించినందుకు ఆనందంగా ఉంది” అని రామ్ చరణ్ పోస్ట్ పెట్టారు. అప్పలసూరి పాత్ర పోషించినందుకు చాలా గౌరవంగా ఆనందంగా ఉందని.. ఈ పాత్రను బాగా ఆస్వాదించానని జగపతి బాబు పేర్కొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page