Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadపెండింగ్ అభివృద్ధి, పారిశుద్ధ్యం పనులు మెరుగుపరచాలి – జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్‌కు విన‌తి...

పెండింగ్ అభివృద్ధి, పారిశుద్ధ్యం పనులు మెరుగుపరచాలి – జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్‌కు విన‌తి ప‌త్రాన్ని అంద‌చేసిన కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్‌

📰 Generate e-Paper Clip

పెండింగ్ అభివృద్ధి, పారిశుద్ధ్యం పనులు మెరుగుపరచాలి

– జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్‌కు విన‌తి ప‌త్రాన్ని అంద‌చేసిన కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్‌

హైదరాబాద్, ఆగ‌స్టు 04, అద్దం న్యూస్ :    పెండింగ్ అభివృద్ధి, పారిశుద్ధ్యం పనులు మెరుగుపరచాలని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ అన్నారు. ఈ మేర‌కు జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ ఆర్‌వి.క‌ర్ణ‌న్‌కు విన‌తి ప‌త్రాన్ని కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ అంద‌చేశారు. డివిజన్‌లో శానిటైజేషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, అలాగే పెండింగ్ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి వహించి చర్యలు తీసుకోవాలని కార్పొరేట‌ర్ పావ‌ని కోరారు. వాటితో పాటుగా జిహెచ్ఎండ‌బ్య్లూఎస్ వాటర్ వర్క్స్ వారు ఏర్పాటు చేసే నూతన సివ‌రేజి పైప్‌లైన్ పనులకు అనుకూలంగా రోడ్డు త్రవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కార్పొరేటర్ పావ‌ని కోరారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ ఆర్‌వి.క‌ర్ణ‌న్‌ సంబంధిత అధికారులను సమన్వయ పరిచి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ పావ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page