ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి
– ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి
హైదరాబాద్, జనవరి 10, అద్దం న్యూస్ : ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అన్నారు. ఆర్టీసీలో యూనియన్లను పునరుద్దరించాలని, 2021, 2025 వేతన సవరణలను అమలు చేయాలని, విలీన ప్రక్రియను పూర్తి చేయాలని, అపాయింటెడ్ డే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టిజిఎస్ ఆర్టీసి-ఎస్‌డబ్ల్యుయు, ఐఎన్‌టియుసి ఆధ్వర్యంలో ఛలో బస్సు భవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బస్ భవన్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరణ చేస్తామని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం ప్రక్రియ పూర్తి చేస్తామని, రాబోవు పిఆర్‌సి పరిధిలోకి టిజిఎస్ ఆర్టీసి కార్మికులను చేరుస్తామని.పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని, కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైన ఒక్క రూపాయి ఖర్చు లేని మ్యానిఫెస్టోలో పెట్టిన యూనియన్లను పునరుద్ధరించలేదు, మిగతా సమస్యలు పరిష్కరించక పోవడం వలన కార్మికులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. ప్రభుత్వం హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అడిషనల్ జనరల్ సెక్రటరీ డి.గోపాల్ మాట్లాడుతూ… ఆర్టీసీ యాజమాన్యం క్షేత్రస్థాయిలో కార్మికుల పై పెంచుతున్న పనిభారాలను తగ్గించాలని, వేధింపులు, అక్రమ సస్పేన్షన్లను, అక్రమ ట్రాన్స్ పర్స్ ఆపాలన్నారు. చనిపోయిన, మెడికల్ అన్ ఫిట్ అయిన విరీ పిల్లలకు రెగ్యులర్ ప్రాతిపాదికన ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోయ యాదయ్య ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ… రిటైర్ అయిన కార్మికులకు సెప్టెంబర్ 2024 నుండి రావాల్సిన లీవ్ ఎన్ క్యాష్ మెంట్ డబ్బులు చెల్లించాలని, 2017 వేతన సవరణ ప్రకారం గ్రాట్యుటీ డిఫరెన్స్, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ డిఫరెన్స్ డబ్బులు చెల్లించాలన్నారు. అలాగే 2017 వేతన సవరణ అరియర్స్ డబ్బులు చెల్లించాలన్నారు. కొవ్వూరు యాదయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కోశాధికారి ఎవివిఎన్.రావు, ప్రచార కార్యదర్శి మనోహర్, శంకరయ్య, గౌరెల్లి కృష్ణ, ఐఎన్‌టియుసి నాయకులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply