Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadస్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి చ‌లి వేంద్రాల‌ను ఏర్పాటు చేయాలి – ఎమ్మెల్యే ముఠా గోపాల్

స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి చ‌లి వేంద్రాల‌ను ఏర్పాటు చేయాలి – ఎమ్మెల్యే ముఠా గోపాల్

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, ఏప్రిల్ 6, అద్దం న్యూస్  స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి చ‌లి వేంద్రాల‌ను ఏర్పాటు చేయాలని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో రాంనగర్ విఎస్‌టి చౌరస్తా వద్ద బిఆర్ఎస్ యువ నాయకుడు సాయి గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవికాలంలో తీవ్ర ఎండ ప్రభావం వలన ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చలి వేంద్రం ఏర్పాటు చేసిన నాయకుడు సాయి గౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాటసారులు దాహం తీర్చడం వెలకట్టలేనిదన్నారు. నాయకులు ప్రధాన కూడలి వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసే ప్రజల దాహాన్ని తీర్చాలని కోరారు. నియోజకవర్గంలో నీటి ఎద్దడి లేకుండా అనునిత్యం జలమండలి అధికారులను అప్రమత్తం చేస్తామని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జై సింహ, రాంనగర్ డివిజన్ అధ్య‌క్షుడు శంకర్ ముదిరాజ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page