Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADప్రజల అభివృద్ది, సంక్షేమం తెలుగుదేశం పార్టీకి రెండు కళ్లు

ప్రజల అభివృద్ది, సంక్షేమం తెలుగుదేశం పార్టీకి రెండు కళ్లు

📰 Generate e-Paper Clip

ప్రజల అభివృద్ది, సంక్షేమం తెలుగుదేశం పార్టీకి రెండు కళ్లు
– టిడిపి జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న

అంబర్‌పేట‌, జూలై 16, ( అద్దం న్యూస్ ) :   తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రజల కొరకని, ప్రజల అభివృద్ది, సంక్షేమం తెలుగుదేశం పార్టీకి రెండు కళ్లని జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న అన్నారు. తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతమే లక్ష్యంగా చేపడుతున్న ” తెలుగుదేశం – ప్రజాపథం ” కార్యక్రమంలో భాగంగా గురువారం అంబర్‌పేట‌ అసెంబ్లీ నియోజకవర్గం బాగ్ అంబర్‌పేట‌ డివిజన్ అధ్యక్షుడు భాను ప్రకాష్ ఆధ్వర్యంలో జ‌రిగింది. ఈ కార్యక్రమం రెడ్ బిల్డింగ్ చౌరస్తా వద్ద నుండి ప్రారంభమైంది. ఈ ” తెలుగుదేశం – ప్రజాపథం ” కార్యక్రమానికి జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న, సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల కిషోర్, రాష్ట్ర బీసీ మాజీ అధ్యక్షుడు శ్రీపతి సతీష్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జివిజి నాయుడు, ప‌లుస‌ బాలరాజు గౌడ్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అంబర్ పేట నాయకులు ఓ.వెంకటేష్ చౌదరి, కరణం కిరణ్, సత్యనారాయణలు సహకరించగా, డివిజన్ నాయకులు నరసింహ గౌడ్, సాయి కుమార్, బిక్షపతి చారి, మెట్టు ధనరాజ్, అశోక్ గౌడ్, సైకిల్ రాజా, ఎండి లాయఖ్, ఎస్‌కె.నదీమ్, జనార్థను తదిరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ముందుగా రెడ్ బిల్డింగ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన పార్టీ జెండాను తిరునగరి జ్యోత్స్న ఆవిష్కరించిన అనంతరం హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక బస్తీలలో పాదయాత్రగా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఓ విలేకరి జిహెచ్ఎంసి ఎన్నికల గురించి కార్యక్రమం చేస్తున్నారా ? అని ప్రశ్నించగా ఆమె మాట్లాడుతూ… ఎన్నికలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై ఉంటుందని తెలిపారు. అనంతరం పాదయాత్రలో ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల అక్రమ వసూళ్లు, రోడ్ల మరమ్మత్తుల గురించి ఫిర్యాదులు అందాయని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి పార్లమెంట్‌ నాయకులు మాజీ ఇన్చార్జ్ వల్లారపు శ్రీనివాస్, మండూరి సాంబశివ రావు, కూన శ్రావణ్ గౌడ్, కాసుల సుదర్శన్ రెడ్డి, తడక వినోద్, శ్యామ్ సుందర్, ప్రమీల, చంద్రమోహన్ గౌడ్, ప్రసాద్, రామారావు, కట్ట రాములు, సిహెచ్.ప్రదీప్ గౌడ్, ఎం.రాజు, పి.వంశీకృష్ణ, పుప్పాల బాలకృష్ణ, గండికోట విజయ్, మగ్గి యాదగిరి, అనిల్, ఎస్.ప్రకాష్, రాజు నాయుడు, ఎండి.సలీం, భవాని శ్రీనివాస్, విక్రమ్, బాలకృష్ణ, రాహుల్, సత్తన్న, రవి, ఆనంద్, శక్తి ప్రేమ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page