పింగళి వెంకయ్య స్మారక సంస్థ, చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం
» ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, జూలై 4, ( అద్దం న్యూస్ ) : పింగళి వెంకయ్య స్మారక సంస్థ, చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య స్మారక సంస్థ & చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహెూన్నతుడు, మహనీయుడు, గాంధేయవాది, మహాత్మాగాంధీ చే మన్ననలందుకున్న, భారతజాతికి త్రివర్ణ పతాకాన్ని ఇచ్చిన పింగళి వెంకయ్య 63 వ వర్ధంతి సందర్భంగా పేదలకు ఫలహారం పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్ మీ సేవా కేంద్రం చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై పేదలకు ఫలహారాన్ని అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ… పింగళి వెంకయ్య భారత దేశ జాతీయ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన మహనీయుడన్నారు. దేశానికి ఇంత సేవ చేసిన పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ కోడూరి శ్రీదేవి, పింగళి వెంకయ్య స్మారక సంస్థ చైర్మన్ కోడూరి శ్యామలరావు, సంస్థ ప్రధాన కార్యదర్శి బంగారు ప్రశాంత్, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రొయ్యూరు శేషసాయి, కాంగ్రెస్ నాయకుడు కేశవ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మేడి సత్యనారాయణ, కర్రా వెంకటేష్, విజయ్ యాదవ్, కిరణ్, కరణం సురేష్ తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply