భారత్ సత్య సంఘం హరినగర్ బస్తీ అధ్యక్షుడిగా పిరంగి భాస్కర్ ఎన్నిక
ముషీరాబాద్, ఏప్రిల్ 5, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ హరినగర్ భారత్ సత్య సంఘం బస్తీ అధ్యక్షుడిగా పిరంగి భాస్కర్ ( భాను ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం బస్తీలో జరిగిన సమావేశంలో భాస్కర్‌ను అధ్యక్షుడిగా బస్తీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ… బస్తీ అభివృద్ది కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. బస్తీలో నెలకొన్న సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు పాటుపడుతానని తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన భాస్కర్‌ను బస్తీవాసులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో కె.నీలాదేవి, పిరంగి నాగరాజు, పిడబ్ల్యు. జాన్సన్, జి.శ్రీనివాస్, కె.వేణుగోపాల్, ఎం.ఆనంద్, నరేష్, ఆర్.బాలరాజు, ఎ.వెంకటేష్, బి.మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.


https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
Leave a Reply