...

ఈ నెల 25న హైదరాబాద్ లో జరిగే నాగన్న సంతాప సభను జయప్రదం చేయండి

ఈ నెల 25న హైదరాబాద్ లో జరిగే నాగన్న సంతాప సభను జయప్రదం చేయండి

హైద‌రాబాద్‌, జూలై 19, ( అద్దం న్యూస్ ) :  ఈ నెల 3వ తేదిన అనారోగ్యంతో మరణించిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అరుణోదయ నాగన్న సంతాప బహిరంగ సభను హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 25 న నిర్వహిస్తున్నామని అరుణోదయ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండల్, కోలా స్వప్న లు తెలిపారు. రాంనగర్ సెంటర్ లో అరుణోదయ సంస్కృతిక సమాఖ్య హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గోడ పత్రిక, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నాగన్న సంతాప బహిరంగ సభలో కవులు కళాకారులు కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సింహా, గోవిందు, వెంకటేష్, రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.