...

గజ్జల దయానంద మాదిగ కుటుంబ‌స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన మంద‌కృష్ణ‌

గజ్జల దయానంద మాదిగ కుటుంబ‌స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన మంద‌కృష్ణ‌

హైద‌రాబాద్‌, జూలై 17, ( అద్దం న్యూస్ ) :    ఇటీవల మరణించిన హైదరాబాద్ జిల్లా ఎంఈఎఫ్ సీనియర్ నాయకుడు గజ్జల దయానంద మాదిగ కుటుంబస‌భ్యుల‌ను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎంఆర్‌పిఎస్ ) అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ శుక్ర‌వారం ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా గజ్జల దయానంద్ మాదిగ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి దయానంద్ కుటుంబానికి ఎంఆర్‌పిఎస్‌ అండ‌గా ఉంటుదని మనోధైర్యం ఇవ్వడం జరిగింది. ఈ సంద‌ర్భంగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ… గజ్జల దయానంద్ మాదిగ హైదరాబాద్ జిల్లా కేంద్రంగా అనేక ఉద్యమాలలో క్రియాశీలకమైన పాత్ర పోషించారన్నారు. ఆయ‌న లేని లోటు ఎంఆర్‌పిఎస్‌ ఉద్యమానికి తీరని లోటు అని.. మాదిగ అమరవీరుల త్యాగాలు మరవలేనివని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎంఈఎఫ్ సీనియ‌న్ నాయ‌కుడు గ‌జ్జల ఈశ్వర్ మాదిగ, ఎంఆర్‌పిఎస్‌ సీనియర్ నాయకులు ఎల్లయ్య మాదిగ, ఎంఆర్‌పిఎస్ నాయ‌కులు గజ్జల సూర్యనారాయణ మాదిగ, ఎంఈఎఫ్ సీనియ‌న్ నాయ‌కుడు గండి కృష్ణ మాదిగ, ఎంఎస్‌పి-ఎంఆర్‌పిఎస్ హైద‌రాబాద్ జిల్లా అధ్య‌క్షుడు టివి.న‌ర‌సింహా, ఎంఎస్‌పి-ఎంఆర్‌పిఎస్ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ మాదిగ, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇటికే కిషన్ మాదిగ, ఎంఆర్‌పిఎస్ నాయ‌కులు రవీందర్ మాదిగ, శ్యామ్ రావు మాదిగ, ప్రసాద్, శ్రీనివాస్‌, అనిల్‌, ఎల్ల‌య్య‌, రాజు, తాండ్ర ముర‌ళీ, మ‌హేష్‌, శంక‌ర్‌, గ‌డ్డం ర‌మేష్‌, వినాయ‌క రావు, యాద‌య్య‌, ఎంఆర్‌పిఎస్ ముషీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ గజ్జల రాజశేఖర్ మాదిగ, రాములు, శ్రీకాంత్, వాసుదేవ్, శ్రీకాంత్‌, సాయికుమార్‌ త‌దిత‌రులు పల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.