జాతీయ బీసీ మహాసభ అధ్యక్షున్ని పరామర్శించిన మాజీ గవర్నర్ దత్తాత్రేయ
కాచిగూడ, జూలై 17, ( అద్దం న్యూస్ ) : కాచిగూడ డివిజన్ నింబోలి ఆడ్డాలోని జమాల్ బస్తీ ప్రాంతానికి చెందిన జాతీయ బీసీ మహాసభ ఆధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజేందర్ పటేల్ గౌడ్ త్వరగా కొలుకోని ప్రజా క్షేత్రంలోకి వచ్చి, ప్రజలకు సేవాలందించాలని మాజీ గవర్నర్ ఆకాక్షించారు. రాజేందర్ పటేల్ గౌడ్‌కు వైద్యపరంగా సహాయ, సహాకారాలు అందించనున్నట్లు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్నె రమేష్ యాదవ్, సుభాష్ పటేల్, కేసరి నర్సింగ్ రావు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply