పాత్రికేయులపై రేవంత్ రెడ్డి వైఖరిని ఖండిస్తున్నాం
తెలంగాణలో దీనావస్థలో విద్య
విద్య మార్పుపై ట్యూషన్ కి కేజ్రీవాల్ వద్దకు రావాలి
– సీఎం రేవంత్ రెడ్డి కి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్, అడ్వకేట్, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ ప్రియాంక కక్కర్ హితవు
హైదరాబాద్, ఆగస్టు 02, అద్దం న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ అధ్యక్షులు, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి ట్యూషన్ కి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్, అడ్వకేట్, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ ప్రియాంక కక్కర్ హితవు పలికారు. శనివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్.దిడ్డి సుధాకర్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మరియు తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జ్ ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ… తెలంగాణలో ఆర్ఎస్ఎస్, బిజెపి ఐడియాలజీ లతో ప్రభుత్వం నడుస్తుంది, రేవంత్ రెడ్డికి ప్రభుత్వం నడపడం చేత కావడం లేదని విమర్శించారు. తెలంగాణ లో ప్రభుత్వ పాఠశాలలు చాలా దీనస్థితిలో ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలలలో కనీస సౌకర్యాలు లేవు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అందరూ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వారే వారికి నాణ్యమైన భోజనం కూడా అందించలేని దీన స్థితిలో ప్రభుత్వం ఉందని వివరించారు. తెలంగాణలో విద్యా రంగానికి ఏడు శాతం బడ్జెట్ కేటాయించడంతో.. ప్రభుత్వ పాఠశాలల ను రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకుంటుందో తెలుస్తుందన్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విద్యకు 25 శాతం బడ్జెట్ కేటాయించి అరవింద్ కేజ్రీవాల్ నాణ్యమైన విద్యను అందించారన్నారు. సింగపూర్ లాంటి దేశాలలో కూడా అరవింద్ కేజ్రివాల్ ప్రవేశపెట్టిన విద్యా విధానంను అక్కడి దేశాలు మెచ్చుకున్నాయన్నారు. ఢిల్లీ నుండి ఉపాధ్యాయులను అక్కడికి పంపించి మరింత పరిజ్ఞానం సంపాదించుకొని వచ్చి ఇక్కడి విద్యార్థులకు విద్యను బోధించారని పేర్కొన్నారు.
న్యూయార్క్ టైమ్స్ కవర్ పేజీలో కూడా ఢిల్లీ విద్యా విధానం గురించి చర్చించడం అంటే మామూలు విషయం కాదని, అందుకే రేవంత్ రెడ్డిని అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి వచ్చి ట్యూషన్ చెప్పించుకోవాలని ఆహ్వానిస్తున్నామని ప్రియాంక కక్కర్ తెలిపారు. విద్యాశాఖ మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, తెలంగాణలో గురుకుల పాఠశాలలో కూడా ఇప్పటివరకు 48 మంది విద్యార్థులు చనిపోయారు అంటే ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ విజ్ఞప్తి రేవంత్ ప్రభుత్వం ప్రభుత్వం పట్ల నిజమైన వార్తలు ప్రజలకు చేరేంతవరకు మీరు కృషి చేయాలని కోరారు. నిన్న రేవంత్ రెడ్డి విలేకరులను ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విలేకరులను బట్టలూడదీసి కొడతా అనడం సరైంది కాదనీ, ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు అంటే జర్నలిస్టులు పెట్టిన భిక్షే అని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply