చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పూర్ణచందర్ నాయక్
స్వేచ్ఛ మృతి పై పూర్ణచందర్ సంచలన లేఖ
తండ్రి తిట్టడం వల్లనే మానసికంగా కుంగిపోయి స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది

హైదరాబాద్, జూన్ 28, అద్దం న్యూస్ : టీవీ న్యూస్ ప్రెజెంటర్, రచయిత్రి, జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కు కారణం ఆమెతో సహజీవనం చేస్తున్న పూర్ణ చందర్ నాయకే అని స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే స్వేచ్చ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి పూర్ణచందర్ నాయక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. స్వేచ్ఛ తండ్రి ఆరోపణల నేపధ్యంలో శనివారం రాత్రి 11 గంటలకు తన అడ్వకేట్ తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి పూర్ణచందర్ నాయక్ వెళ్ళారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ముందు తన పై వస్తున్న ప్రచారంలో నిజంలేదని, అదంతా వాస్తవం కాదని.. సమాజానికి నిజం తెలియాల్సిన అవసరముందని పూర్ణచందర్ నాయక్ ఆరు పేజీల సంచలన లేఖను మీడియాకు విడుదల చేశాడు. ఆమె మృతికి ఆమె మానసిక పరిస్థితి, ఆమె తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణం అని లేఖలో పూర్ణచందర్ రాసుకొచ్చాడు. 2009 నుంచి స్వేచ్ఛతో తనకు పరిచయం ఉందని, 2020 నుండి స్నేహితురాలు అయిన స్వేచ్ఛతో లివింగ్ రిలేషన్ లో ఉంటూ ప్రత్యేక ఇళ్లు తీసుకుని ఇద్దరు కలిసి జీవిస్తున్నామని లేఖలో పేర్కొన్నాడు. తల్లిదండ్రులు స్వేచ్ఛను ఐదు నెలల పసిపిల్లగా ఉన్నప్పుడే వదిలేసి ఆనాటి జనశక్తి పార్టీలోకి వెళ్ళారుని, ఆ తర్వాత ఆమె బంధువుల దగ్గర పెరిగిందని లేఖలో రాశాడు. 2008-2009 మొదటి పెళ్లి, విడాకులు అయ్యాయని, 2016-17 సంవత్సరంలో రెండవ వివాహం కూడా
విడాకులు జరిగాయని పూర్ణచందర్ లేఖలో తెలిపాడు. రెండవ వివాహంలో ఒక ఆడపిల్లకు జన్మించింది. ఆ అమ్మాయి శారీ ఫంక్షన్ సమయంలో కూడా తండ్రి స్థానంలో ఉండి రూ.5 లక్షల రూపాయలను ఇచ్చానని తెలిపాడు. ప్రశాంతత కోసం అరుణాచలం తీసుకెళ్లాలని కోరగా నేను తీసుకెళ్లానని, ఘటన జరిగిన ముందు రోజు స్వేచ్చ తండ్రి వచ్చి ఆమెను అవమానించాడని… రెండు సంవత్సరాలకొకసారి ఒకరిని తీసుకువచ్చి అల్లుడని పరిచయం చేస్తే నా పరువు పోతుందని, పిడిఎస్‌లో పని చేశాను.. గౌరవాన్ని పోగొట్టుకోను అని అన్న మాటలకు స్వేచ్చ తనతో చెప్పుకుంటూ ఏడ్చిందని లేఖలో రాశాడు. మరో వైపు స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. స్వేచ్ఛ కు సంబంధించిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వేచ్ఛ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పూర్ణచంద్రను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
https://www.instagram.com/p/DLWlCdQpmV6/?img_index=1&igsh=MWF3emF6enlta2pxbw==
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply