Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాలి

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాలి

📰 Generate e-Paper Clip

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాలి
– బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహా

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 7, ( అద్దం న్యూస్ ) :    ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాలని బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహా అన్నారు. హైదరాబాద్‌ కవాడిగూడ డివిజన్‌ దోమలగూడ ప్రజల సమస్యలపై ప్ర‌జ‌ల నుంచి అందిన దరఖాస్తుల మూటలతో సోమవారం బీఆర్‌ఎస్‌ నాయకులు జిహెచ్ఎంసి సర్కిల్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంత‌రం డీఎంసీ ఆర్‌.పుష్పలతకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సంద‌ర్భంగా ముఠా జైసింహా మాట్లాడుతూ… ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ధ్వజ‌మెత్తారు. రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మీడియా ఇన్‌చార్జ్ ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు క‌ల్వ‌గోపి, బ‌ల్లెక‌రి ర‌మేష్‌, ప్ర‌భాక‌ర్‌, శ్యామ్ యాద‌వ్‌, సాయికృష్ణ‌, రాజ‌శేఖ‌ర్‌, సంతోష్‌, వేణుగోపాల్‌, రాజు యాద‌వ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page