హైదరాబాద్, అద్దం న్యూస్ : బిసి, ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లలు చదువుకోవాలని, ఉద్యోగాలు చేయాలని, అభివృద్ధి చెందాలని గత 50 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ అనేక విజయాలు సాధిస్తున్న బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యకు మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. తెలంగాణ మేధావుల పోరాట సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆర్.కృష్ణయ్యకు మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ విద్యానగర్ బిసి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మేధావుల పోరాట సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు డాక్టర్.రాజ్ నారాయణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆర్.కృష్ణయ్యకు మహాత్మా జ్యోతిరావు ఫూలె ఎక్సలెన్స్ అవార్డును అందచేసి, లక్ష రూపాయల నగదును ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ మేధావుల పోరాట రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు డాక్టర్.రాజ్ నారాయణ్ ముదిరాజ్ మాట్లాడుతూ…ఆర్.కృష్ణయ్య 5 దశాబ్దాలుగా అనేక పోరాటాలు చేసి 2000 వేల జీవోలను సాధించారని, ఈ రోజు బిసిలు చదువుతున్నారంటే ఆయన చేసిన పోరాట ఫలితమే అని అన్నారు. ఆయన పోరాడి 1500 గురుకుల పాఠశాలలను పెట్టించి, అందులో 8 లక్షల మంది విద్యార్థులు ఉచితంగా చదివేల చేశారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ స్కీం లేదని… బిసి, ఎస్సీ, ఎస్టీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ ఉచిత స్కీములు లేవన్నారు. బలహీనవర్గాల అభివృద్ధికి, ఫీజు రియింబర్స్‌మెంట్ స్కీం పెట్టడం వల్ల విద్యాపరంగా ఉద్యోగాలలో బిసి వారికి రిజర్వేషన్ల కొరకు పోరాడి రాష్ట్రంలో 6 వేల ఎస్సీ, ఎస్టీ, బిసి హాస్టళ్లల్లో పెట్టించారన్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబిఎ ఫార్మసి కోర్సులు చదువుతున్న వారికి రెండు రాష్ట్రాల్లో 32 లక్షల మంది విద్యార్థులు ఉచితంగా చదువుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలు చదువుకుంటేనే సమగ్ర సర్వతోముఖాభివీద్ధి చెందుతారని ముందు చూపుతో గత 50 సంవత్సరాలుగా 12 వేలకు పైగా ఉద్యమాలు చేసి గిన్నీస్ రికార్డును ఆర్.కృష్ణయ్య సృష్టించారన్నారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ… పేద కులాల విద్యార్థులు చదువుకుంటేనే వారి జీవితాలు అభివృద్ది చెందుతారని మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలకనుగుణంగా పోరాటం చేశామన్నారు. యువత ముందుకు వచ్చి సమాజం సమగ్రాభివృద్ధి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అనేక పోరాటాలు చేసిన తనకు ఈ ఎక్సలెన్స్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ సత్యం, నీల వెంకటేష్, రాజు నేత, రామకృష్ణ, తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మేజర్ డాక్టర్.డి.జయసుధ, కోశాధికారి యువ నాగలక్ష్మీ, బిసి యువజన. విద్యార్థి, మహిళా, ఉద్యోగ సంఘాల నాయకులు ఆర్.కృష్ణయ్యకు సన్మానం చేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply