Friday, October 30, 2026
No menu items!
HomeGREATER HYDERABADతాగునీటి దుర్వినియోగంపై కఠిన చర్యలు –ప్రజల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్‌లో రూ.5 వేల జరిమానా

తాగునీటి దుర్వినియోగంపై కఠిన చర్యలు –ప్రజల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్‌లో రూ.5 వేల జరిమానా

📰 Generate e-Paper Clip

వాట్సాప్ ఫిర్యాదు అందిన వెంటనే క్షేత్రస్థాయి తనిఖీ
– ఉల్లంఘన నిర్ధారణతో జరిమానా విధించిన అధికారులు
– నీటి వృథాపై ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి

హైద‌రాబాద్‌, అక్టోబర్ 28, ( అద్దం న్యూస్ ) :    తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి చర్యలు చేపడుతోంది. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఉల్లంఘనలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ పరిధిలో తాగునీటిని వృథా చేసిన ఓ నివాసానికి రూ.5 వేల జరిమానా విధించింది. జూబ్లీహిల్స్ సర్కిల్, జూబ్లీహిల్స్ వార్డు పరిధిలోని రోడ్ నంబర్ 57, ప్లాట్ నంబర్ 1152లో తాగునీటిని ఇంటి ప్రాంగణం శుభ్రపరిచేందుకు వినియోగిస్తున్నట్లు స్థానికులు జలమండలి వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన నేపథ్యంలో జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేపట్టారు. అక్కడ తాగునీటి దుర్వినియోగం జరుగుతున్నట్లు నిర్ధారించుకుని, సంబంధిత నివాసానికి రూ.5 వేల జరిమానా విధించారు. ఫిర్యాదు స్వీకరణ నుంచి క్షేత్రస్థాయి విచారణ, ఉల్లంఘన నిర్ధారణ, జరిమానా విధింపు వరకు చర్యలు చేపట్టడం ద్వారా తాగునీటి దుర్వినియోగాన్ని ఉపేక్షించబోమని జలమండలి స్పష్టం చేసింది. తాగునీటిని తాగడానికి, గృహ అవసరాలకు మాత్రమే పొదుపుగా వినియోగించాలని సూచించింది. ఇంటి ప్రాంగణాలు, రోడ్లు శుభ్రపరచడం వంటి పనులకు తాగునీటిని వృథా చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది.

నీటి దుర్వినియోగంపై ప్రజలే నిఘా పెట్టాలి :
తాగునీటి వృథా, దుర్వినియోగం ఘటనలు ఎక్కడైనా ప్రజల దృష్టికి వస్తే సంబంధిత ఫొటోలు, వీడియోలు, వ్యక్తులు లేదా సంస్థల వివరాలు, ఘటన జరిగిన ప్రాంతం, పూర్తి చిరునామాతో జలమండలి వాట్సాప్ నంబర్ 99499 30003 కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా కస్టమర్ కేర్ నంబర్ 155313 ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపింది. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును పరిశీలించి, అవసరమైన క్షేత్రస్థాయి విచారణ చేపడతామని, ఉల్లంఘనలు నిర్ధారణ అయిన పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. తాగునీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, నీటి వృథాను అరికట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని జలమండలి కోరింది.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page