Friday, October 30, 2026
No menu items!
HomeGREATER HYDERABADఅక్రమంగా అమర్చిన 13 మోటార్లు స్వాధీనం –శంషాబాద్ జోన్‌లో జలమండలి విజిలెన్స్ అధికారుల తనిఖీలు

అక్రమంగా అమర్చిన 13 మోటార్లు స్వాధీనం –శంషాబాద్ జోన్‌లో జలమండలి విజిలెన్స్ అధికారుల తనిఖీలు

📰 Generate e-Paper Clip

శంషాబాద్, అక్టోబర్ 28, ( అద్దం న్యూస్ ) :

తాగునీటి సరఫరా పైపులైన్లకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుకుంటున్న వారిపై జలమండలి విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం శంషాబాద్ జోన్ పరిధిలోని డివిజన్‌–8, కొత్వాల్ గూడ వార్డులోని ఆర్‌బీ నగర్‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 13 అక్రమ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి సరఫరా పైపులైన్లకు అక్రమంగా అమర్చిన మోటార్లను గుర్తించి తొలగించారు. తాగునీటి పైపులైన్లకు నేరుగా మోటార్లు బిగించి నీటిని తోడుకోవడం వల్ల ఇతర వినియోగదారులకు సరిపడా నీరు అందకపోవడంతో పాటు సరఫరా ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని జలమండలి అధికారులు పేర్కొన్నారు. అక్రమ మోటార్ల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page